Kaloji Narayana Rao Award: కాళోజీ పురస్కారానికి ఎంపికైన సాహితీవేత్త?
ఈ అవార్డు కింద ఆయనకు రూ.1,01,116 నగదు బహుమతిని, శాలువాను, మెమొంటోను ప్రదానం చేయనున్నారు. కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి ఉత్సవాల్లో పెన్నాకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. 2015 నుంచి కాళోజీ పురస్కారాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం... ఏటా ఓ సాహితీవేత్తకు అవార్డును ప్రదానం చేస్తోంది.
అలల పడవల మీద...
నల్లగొండ జిల్లాకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ పెన్నా శివ రామకృష్ణ ‘అలల పడవల మీద’, ‘నిశ్శబ్దం నా మాతృక’వంటి కవితా సంకలనాలను ప్రచురించారు. గజల్ ప్రక్రియపై ఆయన చేసిన రచనలు సాహితీవేత్తల ప్రశంసలు అందుకున్నాయి.
కాళోజీ రచనల్లో కొన్ని...
- అణా కథలు
- నా భారతదేశయాత్ర
- పార్థివ వ్యయము
- కాళోజి కథలు
- నా గొడవ
- జీవన గీత
- తుదివిజయం మనది
- తెలంగాణ ఉద్యమ కవితలు
- ఇదీ నా గొడవ
- బాపూ!బాపూ!!బాపూ!!!
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం–2021కు ఎంపికైన వ్యక్తి?
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : తెలంగాణ సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణ
ఎందుకు : సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు...