Skip to main content

సీజే రమణకు OU Doctorate

OU Doctorate CJ ramana
OU Doctorate CJ ramana

ఉస్మానియా యూనివర్సిటీ రెండు దశాబ్దాల తర్వాత గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆగస్టు 5న జరిగే 82వ స్నాతకోత్సవంలో సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ 48వ ఓయూ గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నలుగురు న్యాయమూర్తులు ఓయూ గౌరవ డాక్టరేట్‌ను అందుకోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ డాక్టరేట్‌ను అందుకుంటున్న మొదటి తెలుగు వ్యక్తిగా చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఉస్మానియా చరిత్రలో నిలిచిపోనున్నారు. సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు.  ఆయన విశిష్టసేవలను గుర్తించి ప్రతిష్టాత్మక ఓయూ  గౌరవ డాక్టరేట్‌  అందజేస్తోంది. 

Also read: Raavi Shastri's centenary: హిందీ, ఇంగ్లిష్ లో రావిశాస్త్రి రచనలు
 
ఉన్నత విద్యా శిఖరం ఓయూ 
ఉన్నత విద్య బోధనకు 1917లో నాటి నిజాం నవాబ్‌ హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.  నేటి వరకు ఇక్కడ కోటి మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. 105 ఏళ్ల ఓయూ చరిత్రలో ఇప్పటివరకు 47 మంది మాత్రమే గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.   

Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 27th కరెంట్‌ అఫైర్స్‌

జాతీయ, అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో విశిష్టసేవలు అందించిన మహోన్నత వ్యక్తులను గుర్తించి యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లను అందజేస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించిన నాటి నుంచి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేస్తోంది.  1917 నుంచి ఇప్పటి వరకు 47 మంది గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.  ఏటా విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేసే స్నాతకోత్సవ కార్యక్రమంలో పాలక మండలి ఎంపిక చేసిన వారికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తారు. 

Also read: Free Schemes తీవ్రమైన అంశం : CJ

21 సంవత్సరాల తర్వత  
వివిధ కారణాల నేపథ్యంలో గత 21 ఏళ్లుగా గౌరవ డాక్టరేట్లను అందజేయలేదు. ప్రస్తుత వీసీ  ప్రొ.రవీందర్‌ గౌరవ డాక్టరేట్ల పై వచ్చిన కథనాలకు స్పందించి ఈ నెల 5న జరిగే 82వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను అందజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఓయూ పాలక మండలి సభ్యుల ఆమోదంతో జస్టిస్‌ ఎన్వీ రమణను ఎంపిక చేశారు.  

Also read: Droupadi Murmu takes oath : ప్రమాణ స్వీకారం చేయించిన CJ

రాష్ట్రం ఏర్పడ్డాక తొలి గౌరవం 
తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఓయూ తొలిసారి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో విశిష్టసేవలు అందించిన వారిని పరిశీలించి చివరకు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను ఎంపిక చేశారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఓయూ గౌరవ డాక్టరేట్‌ అందుకుంటున్న మొదటి వ్యక్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ చరిత్రలో నిలిచిపోతారు.  

Also read: Maharastra Political Crisis: విస్తృత ధర్మాసనం పరిశీలించాల్న సీజే

డాక్టరేట్‌ అందుకోనున్న 5వ న్యాయమూర్తి 
ఓయూ క్యాంపస్‌ ఠాగూర్‌ ఆడిటోరియంలో ఆగస్టు 5న  రాష్ట్ర గవర్నర్, ఓయూ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందర రాజన్‌ ఆధ్వర్యంలో జరిగే 82వ స్నాతకోత్సవంలో జస్టిస్‌ ఎన్వీ రమణ 48వ గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్న 5వ న్యాయమూర్తి కావడం విశేషం.  కృష్ణా జిల్లా, పొన్నవరం గ్రామానికి చెందిన చెందిన జస్టిస్‌ ఎనీ్వరమణ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం పూర్తి చేసి న్యాయవాదిగా, న్యాయమూర్తిగా సమాజానికి సేవలందిస్తున్నారు. ఓయూ గౌరవ డాక్టరేట్లను 1917 నుంచి  2001వ సంవత్సరం వరకు 47 మంది అందుకున్నారు. ఓయూలో 1982, 1986 సంవత్సరాల్లో జరిగిన స్నాతకోత్సవాల్లో రికార్డు స్థాయిలో ఒకేసారి ఐదుగురికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. 

Also read: HC Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం

గౌరవ డాక్టరేట్‌ అందుకున్న వారు వీరే 
నవాబ్‌ జమాదుల్‌ ముల్క్‌ బహదూర్‌ (1917), నవాబ్‌ సర్‌ అమీన్‌ జంగ్‌  బహదూర్‌(1918), నవాబ్‌ మసూద్‌ జంగ్‌ బహదూర్‌ (1923), సర్‌ తేజ్‌ బహదూర్‌ సిప్రూ(1938) విశ్వకవి రవింద్రనాథ్‌ ఠాగూర్‌ (1938), మహారాజ్‌ సర్‌ కిషన్‌ పరిషద్‌ బహదూర్‌ (1938), సర్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ (1938), ప్రిన్స్‌ ఆజం జాహె బహదూర్‌(1939), మహారాజ్‌ ఆదిరాజ్‌ బికనూర్‌ ప్రభు(1939), ప్రిన్స్‌ ఆజం జాహె బహదూర్‌ (1940), నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ (1943), సి.రాజగోపాల చారి (1944), రామస్వామి ముదలియర్‌ (1945), సర్‌ జాన్‌ సర్‌ గేంట్‌ (1947), పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రు. (1947), మేజర్‌ జనరల్‌ చౌదరి(1949), బాబు రాజేంద్రప్రసాద్‌ (1951), బింగ్‌ సిలిన్‌ (1951), డాక్టర్‌ సర్వేపల్లి రా«ధాకృష్ణన్‌ (1953), డాక్టర్‌ బాబా సాహేబ్‌ అంబేడ్కర్‌. (1953),  ఎంకే వేల్లోడి(1953), కేఎం మున్షీ (1954), వీకే కృష్ణమీనన్‌ (1956), బూర్గుల రామకృష్ణారావు (1956), అలియార్‌ జంగ్‌ (1956), షేక్‌ అహ్మద్‌ యూమని. (1975), డాక్టర్‌ జార్‌హర్ట్‌ హెర్డ్‌  బెర్గ్‌.(1976), ప్రొఫెసర్‌ సయ్యద్‌ సరుల్‌ హసన్‌. (1977), కలియంపూడి రాధాకృష్ణ(1977), తాలాహె ఈ దైనీ తరాజీ. (1979), యాసర్‌ అరాఫత్‌. (1982), డాక్టర్‌ వై.నాయుడమ్మ.(1982), ప్రొఫెసర్‌ రాంజోషి. (1982), జి.పార్థసారధి(1982), డాక్టర్‌ జహిర్‌ అహ్మద్‌ (1982), జస్టిస్‌ మహ్మద్‌ (1985), జస్టిస్‌ నాగేందర్‌ సింగ్‌(1986), జస్టిస్‌ నిఝంగ్యూ (1986), ఆర్‌.వెంకటరామన్‌ (1986), ప్రొఫెసర్‌ సి.ఎస్‌.ఆర్‌ రావు.(1986), జస్టిస్‌ మన్మోహన్‌రెడ్డి(1986), డాక్టర్‌ రాజా రామన్న1990), బి.పి.ఆర్‌ విఠల్‌ (1993), ప్రొఫెసర్‌ రామిరెడ్డి (1993), డాక్టర్‌ ఎం.సింగ్వీ(1994), డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌(1996), డాక్టర్‌ అరుణ్‌ నేత్రావలి (2001) 

 Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 02 Aug 2022 05:55PM

Photo Stories