Skip to main content

IT Jobs : గేటు దాటకుండానే జాక్‌పాట్‌..ఈ ప్ర‌ముఖ కంపెనీలో ముగ్గురికి రూ.32 లక్షల జీతం

సాక్షి, తాడేపల్లిగూడెం: నిట్‌ విద్యార్థులు జాక్‌పాట్‌ కొట్టారు. మల్టీ నేషనల్‌ కంపెనీల్లో లక్షల్లో వేతనాలతో లక్కీచాన్స్‌ కొట్టేశారు.
సోను సిరాన్‌ (2017–21), వైష్ణవి ఆర్‌ కులకర్ణి (2017–21), హేమంత్‌ వర్ధినీడి (2017–21), హర్షిణి ముదరవల్లి (2017–21) , కనకాల భాగ్య సమీరా (2016–20)
సోను సిరాన్‌ (2017–21), వైష్ణవి ఆర్‌ కులకర్ణి (2017–21), హేమంత్‌ వర్ధినీడి (2017–21), హర్షిణి ముదరవల్లి (2017–21) , కనకాల భాగ్య సమీరా (2016–20)

ఇంకా నిట్‌ గేటు దాటకుండానే ఆఫర్లు లెటర్లు అరచేతిలోకి వస్తున్నాయి. మల్టీ నేషనల్‌ కంపెనీలు(ఎంఎన్‌సీ) ఏపీ నిట్‌లో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి క్యూ కడుతున్నాయి. 2018–22 బ్యాచ్‌లో అప్పుడే 170 మందికి ఆఫర్‌ లెటర్లు వచ్చాయి. ఏడాది వేతనం కనిష్టగా 7.8 లక్షలు కాగా.. గరిష్టంగా రూ.26 లక్షలు పొందారు. 2017–21 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అమెజాన్‌ కంపెనీలో ఏడాదికి రూ. 32 లక్షల ప్యాకేజీతో అదుర్స్‌ అనిపించారు. దీంతో ఆరేళ్ల క్రితం నిట్‌ ఏర్పాటైప్పుడు ఎంఎన్‌సీలకు నిట్‌పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. కొత్త నిట్‌లో ల్యాబ్‌లు సరిగా ఉండవు, విద్యా బోధన ఎలా ఉంటుందో అన్న అనుమానంతో క్యాంపస్‌ ఇంటర్వూ్యలపై వెనకడుగు వేశారు. అయితే ఏపి నిట్‌ విద్యార్థులు తమ టాలెంట్‌తో ఆ సందిగ్ధతకు చెక్‌ పెట్టారు. 

80 శాతానికి పైగా విద్యార్థులకు..
ఏడాది వేతనంగా కనీసం రూ.3.5 లక్షలు, గరిష్టంగా రూ.6 లక్షల ప్యాకేజ్‌ పొందడమంటే జాక్‌పాట్‌గా విద్యార్థులు భావించేవారు. ఇప్పుడు భారీ వేతనాల తో ఆఫర్లు రావడంతో నిట్‌లో చదివేందుకు క్రేజ్‌ పెరగుతోంది. నిట్‌లో ప్లేస్‌మెంటు, ట్రైనింగ్‌ సెల్‌ శిక్షణ ఫలవంతమైంది. నిట్‌ డైరెక్టర్‌ అండ్‌ టీమ్‌ కృషి ఫలి తాలనిస్తుంది. బయటకు వచ్చే బ్యాచ్‌ల్లోని విద్యార్థుల్లో అర్హత సాధించిన వారిలో దాదాపు 80 శాతానికి పైగా విద్యార్థులకు ఆఫర్‌ లెటర్లు వస్తున్నాయి. వేతనాలు కూడా ఊహించని రీతిలో ఉన్నాయి. నిట్‌ నుంచి ఇంతవరకూ మూడు బ్యాచ్‌ల విద్యార్థులు బయటకు వచ్చారు. వారిలో 895 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2015–21 విద్యా సంవత్సరం వరకు మూడు బ్యాచ్‌లు బయటకు వచ్చాయి. 

క్యూ కడుతున్న కంపెనీలు..ఎందుకంటే? 
తాడేపల్లిగూడెం నిట్‌లో క్యాంపస్‌ ఇంటర్వూ్యలు నిర్వహించేందుకు ఎంఎన్‌సీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్, అడట్రాన్, ఫానాటిక్స్, ఫ్యాక్ట్‌సెట్, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, మోడక్‌ ఎనలిటిక్స్, ఇన్ఫో ఎడ్జ్, కిక్‌ డ్రమ్, కాగ్నిజెంట్‌ వంటి మల్టీ నేషనల్‌ కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్య్వులు నిర్వహిస్తున్నాయి.   

☛ 2015–19 బ్యాచ్‌లో ఉద్యోగాలు పొందినవారు : 282 
☛ 2016–20 బ్యాచ్‌లో ఉద్యోగాలు పొందినవారు : 303 
☛ 2017–21– బ్యాచ్‌లో ఉద్యోగాలు పొందినవారు: 310  
☛ 2018–22 బ్యాచ్‌లో 170 మందికి ఇంతవరకూ ఆఫర్‌ లెటర్లు వచ్చాయి.

Published date : 12 Nov 2021 11:37AM

Photo Stories