Skip to main content

Success Story: 5వేలు పెట్టుబడితో 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం... సామాన్యుడికి స్ఫూర్తినింపే ఈ వ్య‌క్తి గురించి మీకు తెలుసా..?

జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సాహసాలు చేసినప్పుడే నలుగురికి ఆదర్శమవవుతారు, సమాజం మిమ్మలి గుర్తిస్తుంది. ఇలా సాహసాలు చేసినవారిలో ఒకరు 'దేవేందర్ కుమార్ జైన్'. కేవలం ఐదు మందితో రూ. 5వేలు పెట్టుబడితో ప్రారంభమై ఈ రోజు కోట్లు గడిస్తున్నారు. ఈయన విజయం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ప్రస్తుతం ఆయన ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Davinder Kumar Jain
Davinder Kumar Jain

నోయిడాలో ఉన్న స్టేషనరీ ఉత్పత్తుల తయారీ సంస్థ 'లక్సర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్' గురించి అందరూ వినే ఉంటారు. 1963లో ప్రారంభమైన ఈ కంపెనీ కేవలం రూ. 5000 పెట్టుబడితో మొదలైంది. అప్పట్లో ఇందులో ఉన్న ఉద్యోగులు కేవలం ఐదు మంది మాత్రమే. ప్రస్తుతం ఈ సంస్థ 95 దేశాల్లో ఉంది, ఇందులోని ఉద్యోగుల సంఖ్య సుమారు నాలుగు వేల కంటే ఎక్కువ.

చ‌ద‌వండి: బిచ్చగాళ్లతో రోడ్డుపై పడుకున్నా.. ఇంట‌ర్‌లో అన్ని సబ్జెక్ట్ లు ఫెయిల్.. ఈ క‌సితోనే నేడు ఐపీఎస్ అయ్యా..

సుమారు ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ కంపెనీ ఆదాయం ఏకంగా రూ. 750 కోట్లు (2023 మార్చి నాటికి). ఇప్పుడు వార్షక ఆదాయం రూ. 1000 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో కంపెనీ కృషి చేస్తోంది. 1975లో మొదటిసారి ఈ కంపెనీ ఫైబర్ టిప్ టెక్నాలజీని ప్రవేశపెట్టి, 1976 నాటికి మార్కర్లు, హైలైటర్ వంటి వాటిని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.

Luxor

1980లో కంపెనీ అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా జపనీస్ బ్రాండ్ పైలట్ పంపిణీదారుగా నిలిచింది. ఆ తరువాత లక్సర్ కంపెనీ 1986లో ప్రపంచ వినియోగదారులపై ద్రుష్టి కేంద్రీకరించి అనేక కొత్త ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. ఇందులో పర్మినెంట్ మార్కర్, ఫ్లోర్ సెంట్ హైలైటర్ వంటి ఉన్నాయి. ఇవన్నీ ఆధునిక కాలంలో మంచి అమ్మకాలను పొందాయి.

లక్సర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తరువాత దశలో డ్రాయింగ్, స్కెచింగ్ వంటి వాటికోసం కూడా కొత్త ఉత్పత్తులను తీసుకువచ్చింది. కంపెనీ తన ఉత్పత్తులలో నానో టెక్నాలజీ ఉపయోగించి ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టింది. వీటికి కంపెనీ 'నానో క్లీన్' అని పేరు పెట్టింది.

Luxor

రూ. 5000తో ప్రారంభమైన కంపెనీ పెన్నులు, స్టేషనరీ దగ్గర మాత్రమే ఆగిపోకుండా వివిధ రంగాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. ఇందులో లక్సర్ గ్రూప్ హాస్పిటల్, రియల్ ఎస్టేట్, రిటైల్, నానో క్లిప్ టెక్నాలజీ వంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా కంపెనీ అభివృద్ధికి దోహదపడ్డాయి.

చ‌ద‌వండి: మెహందీ పెట్టుకున్నా.. నిమిషం ఆల‌స్య‌మైన నో ఎంట్రీ... రేపే పోలీస్ రాత ప‌రీక్ష‌.. 

Published date : 29 Apr 2023 05:15PM

Photo Stories