Inspirational Women: శభాష్ స్మృతి
Sakshi Education
న్సర్ రోగుల కోసం తన పొడవైన జట్టును దానంచేసి కొరాపుట్‌కు చెందిన యువతి ఔదార్యాన్ని చాటుకుంది. కొరాపుట్ జిల్లా కేంద్రానికి చెందిన స్మృతి సుధా సాహు భువనేశ్వర్‌లో ఉన్నత విద్యను అభ్యనిస్తూ, సివిల్స్ కోసం శిక్షణ పొందుతోంది. ఇటీవల కేన్సర్ పీడిత మహిళల సమస్యలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
కేన్సర్ మహిళా రోగులకు కీమోథెరఫీ నిర్వహించిన తర్వాత జట్టు ఊడిపోతుంది. దీంతో వారికి విగ్గు అవసరం ఏర్పడుతుంది.
బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి.. వేల కోట్ల కంపెనీ నిర్మించిన ఎంఆర్ఎఫ్ ఫౌండర్ మామెన్ సక్సెస్ జర్నీ
ఇలాంటి మహిళల కోసం సోప్వ అనే స్వచ్ఛంద సంస్థ మహిళల నుంచి జట్టును విరాళంగా సేకరిస్తుంది. దీంతో వెంటనే కేన్సర్ పేషెంట్లకు కనీస తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో స్మృతి ఆ సంస్థను సంప్రదించింది. సన్నిహితులు, సహచర విద్యార్థుల సమక్షంలో తన జట్టును విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒడిశాలో సుమారు 50 వేల మంది కేన్సర్ బాధితులు ఉన్నారన్నారు. చికిత్స సమయంలో జుట్టు రాలిపోతే మానసికంగా వేదనకు గురవుతారని పేర్కొన్నారు.
Rajinder Gupta: రోజుకు రూ.30తో ప్రారంభించి... నేడు రూ.12 వేల కోట్లకు అధిపతి... రాజేందర్ గుప్తా సక్సెస్ జర్నీ..!
అలాంటి వారికి జట్టు ఇవ్వడం వలన వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. తన నిర్ణయం తల్లిదండ్రులకు చెబితే సగం జుట్టు కంటే, పూర్తిగా ఇవ్వాలని సూచించి మద్దతు తెలిపారని ఆనందం వ్యక్తం చేసింది.
Published date : 14 Jun 2023 07:31PM