Skip to main content

Inspiring Story: పూరి గుడిసెలో నివాసం.. నైట్ వాచ్‌మన్‌గా జాబ్‌.. సీన్ కట్ చేస్తే ఐఐఎంలో ప్రొఫెసర్.. రంజిత్ సక్సెస్ స్టోరీ

కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతారు అని ఓ సినీ గేయ క‌వి చెప్పిన‌ట్లు... సంక‌ల్పం ఉంటే ఎంత‌టి విజ‌య‌మైన మ‌న చెంత‌కు చేరుతుంద‌ని నిరూపించాడు ఓ కేర‌ళ యువ‌కుడు. త‌న చ‌దువుకు పేద‌రికం ఏ మాత్రం అడ్డుకాకుండా చూసుకొన్నాడు. రాత్రి వాచ్‌మెన్‌గా.. ప‌గ‌టి స‌మ‌యంలో కాలేజీ స్టూడెంట్‌గా ప‌నిచేస్తూ క‌ష్ట‌ప‌డి చ‌దివిన‌దానికి ఫ‌లితం ద‌క్కింది.
Ranjith Ramachandran
Ranjith Ramachandran

దేశంలోనే అత్యున్న‌త విద్యాసంస్థ‌లైన ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా సెలెక్టై త‌న‌లాంటి యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. అత‌నే రంజిత్ రామ‌చంద్ర‌న్‌... 

రంజిత్ రామచంద్రన్ స్వ‌స్థ‌లం కేరళలోని క‌స‌ర్‌గ‌డ్‌(Kasaragod). అత‌ని తండ్రి టైల‌ర్‌. త‌ల్లి దిన‌స‌రి కూలి. ఆ దంపతులకు వ‌చ్చే డ‌బ్బుతో కుటుంబ పోష‌ణ గ‌డ‌వ‌డ‌మే క‌ష్టం. వ‌చ్చే కూసింత డ‌బ్బు కూడు, గుడ్డ‌కే స‌రిపోతోంది. దీంతో పిల్లాడిని మంచి చ‌దువులు చ‌దివించ‌లేక‌పోతున్నామ‌నే బాధ వారిలో ఉండేది.

Ola Cabs Co-Founder Ankit Bhati: ఒకే ఒక్క ఆలోచ‌న‌... ఐదేళ్ల‌కు వేల కోట్ల అధిప‌తిని చేసింది... అంకిత భాటి స‌క్సెస్ జ‌ర్నీ ఇదే

Ranjith Ramachandran

త‌న కుటుంబ ప‌రిస్థితిని చిన్న‌నాటి నుంచే అర్థం చేసుకున్న రామ‌చంద్ర‌న్ చ‌దువులో ఎప్పుడూ ముందుండే వాడు. స్థానికంగానే 10, ఇంట‌ర్ పూర్తి చేశాడు. క‌స‌ర్‌గ‌డ్ జిల్లా కేంద్రంలోని సెయింట్ పీయస్ కాలేజీలో క‌ళాశాల‌లో డిగ్రీ జాయిన్ అయ్యాడు. తిన‌డానికి తిండే స‌రిగా లేదు.. ఇక కాలేజీ ఫీజు, ఖ‌ర్చులు భ‌రించ‌డానికి ఆ త‌ల్లిదండ్రుల‌కు స్తోమ‌తలేదు.

దీంతో క‌స‌ర్‌గ‌డ్‌లోని బీఎస్ఎన్ఎల్ కార్యాల‌యంలో నైట్ వాచ్‌మెన్‌గా జాయిన్ అయ్యాడు. ఉద‌యం కాలేజీ.. అది పూర్త‌వ‌గానే నేరుగా బీఎస్ఎన్ఎల్ కార్యాల‌యానికి వెళ్లి వాచ్‌మెన్‌గా విధులు నిర్వ‌హించేవాడు. అలా క‌ష్ట‌ప‌డుతూ ఎక‌నామిక్స్‌లో డిగ్రీ ప‌ట్టా పొందాడు. 

ట్యూష‌న్లు చెప్ప‌డంతో ప్రారంభించి... యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ... వేల కోట్లకు అధిపతైన‌ అలఖ్ పాండే స‌క్సెస్ జ‌ర్నీ

పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు త‌న‌కు చ‌దువు ఒక్క‌టే మార్గం అనిపించింది. డిగ్రీ పూర్త‌వ‌గానే ఐఐటీ మద్రాస్ పీహెచ్‌డీకి అర్హ‌త సాధించాడు. రామ‌చంద్ర‌న్‌కు మ‌ళ‌యాళం త‌ప్పితే ఇంకో భాష రాదు. ఇంగ్లిష్‌లో క‌మ్యూనిష‌న్ అంతంత మాత్ర‌మే. దీంతో పీహెచ్‌డీలో తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డాడు. 

Ranjith Ramachandran

ఒకానొక స‌మ‌యంలో పీహెచ్‌డీ వ‌దిలేసి వెళ్లిపోదామ‌ని రామ‌చంద్ర‌న్ నిర్ణ‌యించుకున్నాడు. అదే స‌మ‌యంలో అక్కడే ప్రొఫెసర్ గా చేస్తున్న డాక్టర్ సుభాష్ రామ‌చంద్ర‌న్‌ను ప్రోత్సహించాడు. అన్నీ త‌నే ద‌గ్గ‌రుండి నేర్పించాడు. ప్రొఫెస‌ర్ స‌హాయానికి రామ‌చంద్ర‌న్ ప‌ట్టుద‌ల‌తోడ‌డంతో పీహెచ్‌డీ ప‌ట్టా సాధ్య‌మైంది.  

Kanhaiya Sharma Success Story: 2.5 కోట్ల వేత‌నాన్ని వ‌దిలేసి... సొంతంగా స్టార్ట‌ప్ స్థాపించి... 23 ఏళ్ల‌కే కోట్ల‌కు అధిప‌తి అయిన క‌న్హ‌య్య శ‌ర్మ స‌క్సెస్ జ‌ర్నీ

పీహెచ్‌డీ ప‌ట్టారాగానే బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా జాయిన్ అయ్యాడు. అదే స‌మ‌యంలో రాంచీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా పోస్టింగ్‌లు ప‌డ‌డంతో వాటికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. త‌న క‌ష్టానికి కాసింత అద‌`ష్టం తోడ‌వ‌డంతో ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా ఎంపిక‌య్యాడు. 

Ananth Narayanan success story: మింత్రా సీఈఓ ప‌ద‌విని వ‌దిలేసి... ఆరు నెలల్లోనే 10 వేల‌ కోట్ల బిజినెస్‌ను స్థాపించిన అనంత్ స‌క్సెస్ జ‌ర్నీ

విజ‌యానికి ద‌గ్గ‌రిదారులు ఉండ‌వు. క‌ష్ట‌ప‌డితే ఫ‌లితం ద‌క్క‌కుండా ఉండ‌దు అని నిరూపించాడు క‌దా రంజిత్ రామ‌చంద్ర‌న్‌. సంకల్పం, కృషి, ప‌ట్టుద‌ల‌తో పూరి గుడిసె నుంచి దేశంలోనే అత్యున్న‌త విద్యాసంస్థ‌ల్లో బోధించేస్థాయికి చేరుకోవ‌డం గొప్ప విష‌యం. కేరళలోని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన రంజిత్ కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అన‌డంలో సందేహం లేదు. ప్ర‌స్తుతం రంజిత్ వ‌య‌సు 30 ఏళ్లు. త‌న 28వ ఏటా అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. 

Published date : 21 Jun 2023 03:28PM

Photo Stories