Skip to main content

Inspirational Story: 11 ఏళ్ల వ‌ర‌కు మాట‌లే రావు.. 18 ఏళ్ల వ‌ర‌కు చ‌ద‌వ‌డం, రాయ‌డం రాదు... కానీ, తాన‌నుకున్న ప్రొఫెస‌ర్ అయ్యాడిలా

అతనికి 11 ఏళ్లు వచ్చే వరకు మాటలే రాలేదు. ఇక 18 ఏళ్లు వచ్చే వరకు ఆ యువకుడు చదవడం రాయడం నేర్చుకోలేకపోయాడు. కానీ ఓ ప్రఖ్యాత యూనివర్సిటీకి ప్రోఫెసర్‌ అయ్యాడు. పైగా నల్లజాతీయుల్లో పిన్న వయస్కుడైన ప్రోఫెసర్‌గా నిలిచాడు.
Jason Arday

అదేలా సాధ్యం అనిపిస్తోందా మీకు! కానీ, జాసన్‌ ఆర్డే అనే వ్యక్తి అనితర సాధ్యమైనదాన్ని సాధ్యం చేసి చూపి అందరికీ గొప్ప మార్గదర్శిగా నిలిచాడు.
ఆటిజంతో బాధ‌ప‌డుతూ....
జాసన్‌ ఆర్డే అనే వ్యక్తి లండన్‌లోని క్లాఫామ్‌లో జన్మించాడు. అతను పుట్టుకతో ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. ఈ డిజార్డర్‌ ఉండే పిల్లలకి సాధారణ పిల్లలో ఉండే పరిణతి ఉండదు. మానసిక ఎదుగుదల సంక్రమంగా ఉండక.. అందరి పిల్లల మాదిరి నేర్చుకోలేక వెనుకబడిపోతారు. జాసన్‌ ఈ సమస్య వ‌ల్ల‌ 11 ఏళ్లు వచ్చే వరకు మాట్లాడలేకపోయాడు. దీంతో చదవడం, రాయడం వంటివి 18 ఏళ్లు వచ్చే వరకు కూడా నేర్చుకోలేకపోయాడు. అదీగాక జాసన్‌కు ఎవరోఒకరి సాయం తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది. ఎలాగైనా.. తనంతట తానుగా ఉండగలిగేలా.. అన్ని నేర్చుకోవాల‌ని తపించేవాడు. 

చ‌ద‌వండి: అనాథగా పెరిగి... ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్నాడు
ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుని...

తన తల్లి బెడ్‌రూంలో వరుసగా లక్ష్యాలను రాసుకుని ఎప్పటికైనా చేరుకుంటానని ఆశగా చూసేవాడు జాసన్‌. నెల్సన్‌ మండేలా జైలు నుంచి విడుదలైన క్షణాలు, 1995లో రగ్బీ ప్రపంచకప్‌లో దక్షిణాప్రికా సింబాలిక్‌ విజయాన్ని కైవసం చేసుకోవడం... టీవీలో చూసిన తర్వాత తన మనోగతాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. వారు పడ్డ కష్టాలను తెలుకుని చలించిపోయాడు. 
త‌న‌లా బాధ‌ప‌డే వారి కోసం...
అప్పుడే అనుకున్నాడు అత్యున్నత చదువులు అభ్యసించి.. కేంబ్రిడ్జి యూనివర్సిటికి ప్రోఫెసర్‌ కావాల‌ని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఐతే అకడమిక్‌ పరంగా తనకు రాయడం, చదవడం వంటివి నేర్పించే గురువు లేరు కాబట్టి దీన్ని ఒక అనుభవంగా తీసుకువాలి. నాలా బాధపడేవాళ్ల కోసం ఉపయోగపడేందుకైనా ముందు దీన్ని అధిగమించాలి అని గట్టిగా తీర్మానించుకున్నాడు.

చ‌ద‌వండి: కల కనింది.. 25 ఏళ్లకే జడ్జి అయ్యింది.. గాయత్రి జర్నీ సాగిందిలా
2018లో తొలిసారిగా....
అలా జాసన్‌ ఎన్నో తిరస్కరణల అనంతరం రెండు మాస్టర్స్‌లో అర్హత సాధించాడు. సర్రే యూనివర్సిటీ నుంచి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ స్టడీస్‌లో డిగ్రీ పొందడమే గాక 2016లో లివర్‌పూల్‌ జాన్‌ మూర్స్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందాడు. 2018 తొలి సారిగా ప్రోఫెసర్‌గా తన తొలి పత్రాన్ని ప్రచురించాడు. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగం సంపాదించడంతో యూకేలో నల్లజాతీయుల‌లో అతి పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా నిలిచాడు. 
న‌ల్ల‌జాతీయుల‌కు అండ‌గా...
ప్రోఫెసర్‌, యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ అయిన భాస్కర్‌ వీరా.  జాసన్‌ని అసాధారణమైన ప్రోఫెసర్‌గా పిలుస్తుంటారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రాతినిధ్యం లేని వెనకబడిన తరగతులు... ముఖ్యంగా నల్లజాతీయులు, ఇతర మైనార్టీ వర్గాల వరకు అండగా నిలవడమేగాక మార్గదర్శిగా ఉంటాడని జాస‌న్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నాడు.

చ‌ద‌వండి: శభాష్‌ అవని.... తొలి ఫైటర్‌ పైలట్‌ జీవిత విశేషాలు తెలుసా..?

Published date : 28 Feb 2023 01:11PM

Photo Stories