Skip to main content

Inspirational Story: గ్రూప్‌–1 ఉద్యోగానికి సెలక్ట్ అయ్య‌నిలా..

వేధింపులపై నోరు మెదిపితే, ఇదేంటని ప్రశ్నిస్తే, నలుగురికీ తెలిస్తే, అమ్మో ఆడపిల్లలం.. హద్దుల కోట దాటకూడదు.. గుండెల్లో వేదన బయటకురాకూడదు. హింసించడం మగాళ్ల జన్మహక్కు.. భరించడం ఆడాళ్ల విధి రాత..ఇదీ నేటి సమాజంలో మహిళల దుస్థితి.
డీఎస్పీ ఎం స్నేహిత
డీఎస్పీ ఎం స్నేహిత

ఇలాంటి వారి కోసమే నేనున్నానంటూ వస్తోంది ‘సబల’ . అన్ని వర్గాల మహిళ రక్షణ కొంగై మిమ్మల్ని కాపాడనుంది. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సబలను ప్రాజెక్టు నోడల్‌ అధికారి స్థాయిలో డీఎస్పీ ఎం స్నేహిత ముందుకు నడిపించారు. 

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

మొదట్లోరనే ప్రశ్నిస్తే..
రోడ్డుపై యువతిని ఎవరైనా కామెంట్‌ చేస్తే తలొంచుకుని వెళుతుంది. ఇంట్లో మహిళలు ‘నా భర్తే కదా కొట్టాడు’ అని ఊరుకుంటారు. దీంతో కొట్టటం తన హక్కు అన్న భావన మగాళ్లలో వస్తుంది. మొదట్లోరనే ప్రశ్నిస్తే, పోలీసులను ఆశ్రయిస్తే సమస్య తెగేదాకా వెళ్లకుండా ఉంటుంది. వీరి కోసమే ‘సబల’ ప్రారంభించామని  డీఎస్పీ స్నేహిత తెలిపారు. 

తన స్నేహితుడు ఫోన్‌ చేస్తూ..
ఫిర్యాదు చేస్తున్న మహిళల శాతం పెరిగినా చైతన్యస్థాయి మెరుగుపడాలి. ఇంకా నోరువిప్పలేని వారి కోసం జిల్లాలో ‘సబల’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం.  ఎస్పీ అప్పలనాయుడు ఆలోచనతో రెండు నెలలుగా పైలెట్‌ ప్రాజెక్టుగా రహస్యంగా అమలు చేస్తున్నాం. మహిళా కానిస్టేబుళ్లు కాలేజీ విద్యార్థులు, పని చేసే కూలీలు, ఉద్యోగినులు, గృహిణులను కలుస్తూ వారి అంతరంగాన్ని తెలుసుకుంటున్నారు. అన్యాయాన్ని పూసగుచ్చితే ఫిర్యాదు తీసుకుని అందుకు పాల్పడినవారి పీచమణుస్తున్నాం. మహిళల నుంచి స్పందన బాగుంది. హాస్టల్‌లో ఉండే విద్యార్థినిని తన స్నేహితుడు ఫోన్‌ చేస్తూ వేధిస్తున్నాడు. అనుకోకుండా ఆ ఫోను తీసిన రూమ్మేట్‌కూ ఆ బాధ తప్పలేదు.‘సబల’కు చెప్పటంతో అతడిని అరెస్టు చేశాం.

TSPSC & APPSC: గ్రూప్స్ ప‌రీక్ష‌ల్లో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుంచి ఎన్ని మార్కులు వ‌స్తాయంటే..?

కుటుంబ నేప‌థ్యం :
తూర్పుగోదావరి జిల్లా మాది. కాకినాడ దగ్గర తాళ్లరేవులో మా నాన్న పేరు నాగేశ్వ‌రావు. మా నాన్న‌ ప్రధానోపాధ్యాయుడు. మా అమ్మ పేరు సుహాసిని. మా అమ్మ‌ గృహిణి. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఇద్దరు చెల్లెళ్లూ ఇంకా చదువుతున్నారు. అంతా ఆడపిల్లలే అని వారెప్పుడూ విచార పడింది లేదు. మరింతగా ఖర్చు పెడుతూ ఎక్కువగా చదివించారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా చదువులంటారు.. పెళ్లిళ్లు చేయకుండా’ అంటూ బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు ప్రశ్నిస్తున్నా పట్టించుకోలేదు. ఓపికగా చదివించారు.

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​  

నా చ‌దువు :
మా నాన్న ప‌నిచేసే స్కూల్లోనే  నేను 6వ త‌ర‌గ‌తి నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్నాను. నా చ‌దువు అంతా కాకినాడ‌లోనే జరిగింది. నా విద్యాభ్యాసం అంతా ప్ర‌భుత్వ స్కూల్స్‌, కాలేజీలోనే జ‌రిగింది. ఈ విష‌యాన్ని నేను గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను. పీజీ మాత్రం బ‌య‌ట చ‌దివాను.

గ్రూప్‌–1కు ఇలా సెలక్టయ్యాను..
డిగ్రీ తర్వాత నుంచి గ్రూప్స్, సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతూ పీజీ, ఎంఫిల్‌ చేశాను. 2012లో ఏపీపీఎస్సీ గ్రూప్‌–1లో సెలక్టయ్యాను. పీహెచ్‌డీ కూడా చేయబోతున్నా. సమయం సరిపోవటం లేదు.  నా సెకండ్ ఆప్షన్‌లో డీఎస్సీ వ‌చ్చింది.

Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌​​​​​​​

నా తొలి పోస్టింగ్ ఇక్క‌డే..

Job


గ్రూప్‌–1లో నెగ్గి డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక తొలి పోస్టింగ్‌ సైబరాబాద్‌లో ఇచ్చారు. అక్కడ షీ టీమ్స్‌లో పని చేశాను. రోడ్లపై డెకాయ్‌ ఆపరేషన్లు చేస్తూ ఆడవాళ్లపై వేధింపులు/హింసకు పాల్పడే వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం ‘షీ’ విధి. ఇందులో మూడేళ్లు పని చేసిన నేను రెండు వేల వరకు కేసులు నమోదు చేయగలిగా. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘సబల’కు జిల్లా నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నాను. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో సెన్సిటివ్‌గా ఉంటారు. వీరి నుంచి జాగ్రత్తగా సమాచారం తీసుకోవాలనే ఉద్దేశంతో సబల రూపకల్పన జరిగింది.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

నిశ్వబ్దాన్ని వీడితేనే.. విముక్తి..
వేధింపులు, హింసకు గురైన మహిళలు నాలుగు గోడల మధ్య కుమిలిపోతే న్యాయం జరగదు. అన్యాయంపై నిశ్శబ్దాన్ని వీడా. గొంతు పెగల్చుకొని ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. దోషులకు దండనతోనే బాధితులకు ఉపశమనం కలుగుతుంది. మరొక మగాడు ఆ నేరానికి పాల్పడేందుకు భయపడతారు. మహిళలపై ఆగడాలకు వారి మౌనం కూడా దారితీస్తోందని చెప్పటానికి నేను సంకోచించను. ఆవారాగా తిరిగే ఓ యువకుడు నలుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయిదో అమ్మాయి మైనరు. అయినా ధైర్యంగా నోరు విప్పింది. కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. మొదటి బాధితురాలే నిశ్శబ్దాన్ని వీడినట్టయితే ముందు నలుగురూ అతడి బారిన పడేవారు కాదు కదా!

Group-1 Books: గ్రూప్‌–1కి ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు పరుగులు.. ఈ పుస్తకాల కోసమే.. కానీ

Published date : 05 May 2022 05:38PM

Photo Stories