Skip to main content

Success Story: కార్పొరేట్ జాబ్స్‌ వ‌దిలేసి.. రోడ్ల‌పై స‌మోసాల‌తో స్టార్ చేసి... నేడు కోట్లు సంపాదిస్తున్నారు..

మ‌న‌సుంటే మార్గం ఉంటుంది. ఏదైనా సాధించాలి అని ఆలోచ‌న ఉండాలే గానీ, అందుకు మార్గాలు అనేకం క‌నిపిస్తాయి. అందులో ఒక మంచి మార్గాన్ని ఎంచుకుంటే చాలు.. స‌క్సెస్ మ‌న ద‌రికి వ‌చ్చేస్తుంది. ఒక చిన్న తోపుడు బండి మీద స‌మోసాలు అమ్మి... కోట్లు సంపాదిస్తున్నారు. ఏంటి వింటే అతిశ‌యోక్తిగా అనిపిస్తోందా.? కానీ, ఇదే నిజం.
Nidhi Singh and Shikhar Veer Singh
Nidhi Singh and Shikhar Veer Singh

ఒక యువ జంట స‌మోసాలు అమ్ముతూ వంద‌ల కోట్లు సంపాదిస్తున్నారు. ఆ జంట స‌క్సెస్ స్టోరీ మీకోసం...
శుభ్రంగా లేక‌పోవ‌డం నుంచే ఆలోచ‌న‌...
నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్ బ్యాచిలర్ బయోటెక్నాలజీ కోర్సుని పూర్తి చేసేందుకు  2004లో థానేలోని  కురకేత్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. కొద్దికాలంలోనే ఇద్ద‌రు మంచి స్నేహితులుగా మారారు. వారి మ‌న‌సులు కూడా క‌ల‌వ‌డంతో స్నేహం ప్రేమ‌గా మారింది. ఇలా ఆడుతూ పాడుతూ కాలేజీ డేస్‌ను ఎంజాయ్ చేస్తూ డిగ్రీ పూర్తి చేశారు. నిధి ఆలోచ‌న‌లు మాత్రం బిజినెస్ వైపు వుండేవి. ఏదైనా సాధించాలి అనే త‌ప‌న ఉండేది. ఈ ఆలోచ‌న‌ల‌తోనే డిగ్రీ పూర్త‌వ‌గానే థానే నుంచి ఢిల్లీకి పయనమైంది. ఢిల్లీలో అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో జాయిన్ అయ్యింది.

చ‌దవండి: క‌ర్ర‌ల‌తో ప్రాక్టీస్... క‌టింగ్ చేస్తూ ఎదిగాడు.. రాహుల్ ప్ర‌స్థానం సాగిందిలా

శిఖర్ ఉన్నత చదువుల కోసం థానే నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. చదువుకునే సమయంలో స్నాక్ ఐటమ్స్ అమ్మకాల్లో శుభ్రత లేకపోవడాన్ని గమనించాడు. అన్నీ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో పిజ్జాలు, బర్గర్లను అమ్మితే.. అదే ఇండియన్ స్నాక్స్, సావీరస్ (సాల్టీగా-స్పైసీగా) ను వీధుల్లో  అమ్మడాన్ని గమనించాడు.
సమోసాలు అమ్ముదాం నిధి...
అదిగో అప్పుడే శిఖర్‌కు దిగ్గజ రెస్టారెంట్లకు పోటీగా సమోసా వ్యాపారం చేయాలన్న ఆలోచనకు బీజం పడింది. తన ఐడియాను నిధికి షేర్‌ చేశాడు. వ్యాపార మెళకువలు తెలియని శిఖర్‌.. కియోస్కోలో సమోసా అమ్మితే ఎలా ఉంటుందని నిధికి తన మనసులో మాట చెప్పాడు. ఈ మ‌ధ్య‌లో ఇద్ద‌రూ పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, వారి ఆలోచ‌న‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. శుభ్రత (Hygiene)తో పాటు సమోసాను వినూత్నంగా తయారు చేయాలని అనుకున్నారు. కానీ అది కార్య రూపం దాల్చలేదు.

​​​​చ‌ద‌వండి: స్కూల్ అంటేనే బోర్‌... క్రికెటే ఎక్కువ ఆడేవాడిని..: స‌త్య నాదెళ్ల
జాబ్‌కు రిజైన్‌ చేసి...
సంవత్సరాలు గడిచాయి. చివరికి 2015 అక్టోబర్ లో బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకుని శిఖ‌ర్‌ జాబ్‌కు రిజైన్ చేశాడు. మ‌రోవైపు నిధి త‌న జాబ్ చేస్తూనే స‌మోసా బిజినెస్‌లో సాయప‌డ‌డం చేస్తోంది. అలా ఓ నాలుగు నెలల పాటు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని వినూత్నంగా పలు షేపుల్లో సమోసాను తయారు చేశాడు శిఖర్. జిడ్డు లేకుండా, కాల్చకుండా స‌మోసాను రెడీ చేశారు. చికెన్ మఖానీ (బటర్ చికెన్), కడాయి పనీర్ నుంచి చాక్లెట్ వరకు రకరకాల రుచుల్లో సమోసాలు అందించేందుకు సిద్ధమయ్యారు.
తోపుడుబండి మీద సమోసాలు...
అమ్మేందుకు సమోసా సిద్ధమైంది. ప్రొడక్ట్  ఉంటే సరిపోదు కదా. దానికంటూ పేరుండాలి. సమోసా సింగ్ గా పేరు కూడా పెట్టేశారు. అలా తయారు చేసిన స‌మోసాల రుచి ఎలా ఉందో తెలుసుకునేందుకు ముందుగా తోపుడుబండ్ల‌పై అమ్మ‌డం మొద‌లు పెట్టారు. అంద‌రూ సూప‌ర్‌గా ఉన్నాయంటూ కితాబివ్వ‌డంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బెంగళూరులో సమోసా సింగ్ పేరుతో క్యూఎస్ఆర్ అవుట్ లెట్‌ను ప్రారంభించారు.
ధ‌ర త‌క్కువ‌.. నాణ్య‌త ఎక్కువ‌
హోమ్ డెలివరీలు చేయడం కూడా ప్రారంభించారు. టేస్ట్‌ అదిరింది. ధర రీజనబుల్‌గా ఉంది. రెండు సమోసాలు రూ.20, చికెన్ మఖానీ సమోసాలు (రెండు) రూ. 55కే అమ్మ‌డం ప్రారంభించారు. ధర తక్కువగా ఉండడం సమోసా సింగ్‌కు కలిసి వచ్చింది. మౌత్ పబ్లిసిటీ పెరిగి రెండు నెలల్లో ఆర్డర్‌లు రోజుకు 500 సమోసాలు అమ్మే స్థాయికి ఎదిగారు. 

చ‌ద‌వండి:పేప‌ర్‌బాయ్‌గా చేసి ప్ర‌పంచం గ‌ర్వించేస్థాయికి చేరుకున్న తెలుగుతేజం
భారీ ఆర్డర్‌తో తిరిగిన ద‌శ‌...
బిజినెస్ ఊహించని విధంగా సాగుతుండడంతో నిధి క్యాష్ కౌంటర్ నుంచి..కార్పొరేట్ ఆర్డర్ల కోసం మార్కెటింగ్ విభాగంలో అడుగు పెట్టింది. అలా తనకున్న మార్కెటింగ్ అనుభవంతో జర్మన్ కంపెనీ నుంచి 8వేల సమోసాలను తయారు చేసి ఇచ్చే ఆర్డర్‌ను సంపాదించింది. ఆర్డర్ అయితే వచ్చింది. చేయడం, వాటిని నిల్వ చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉందని భావించారు. సదరు సంస్థను వారం రోజుల సమయం అడిగారు. వారంలో మళ్లీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్‌పై పనిచేశారు. సమోసా చెప్పిన టైంకు చేసి ఆర్డర్ ఇవ్వాలి. ప్రొడక్ట్ చెడిపోకుండా తయారు చేసేలా రీసెర్చ్ చేశారు. షిప్ట్‌ల వారీగా సమోసాలు తయారు చేసి చెప్పిన టైం కంటే ముందే ఆర్డర్ సిద్ధం చేశారు.
రోజుకు రూ.12 లక్షలు...
జర్మనీ ఆర్డర్ తర్వాత సమోసా సింగ్ పేరు మార్మోగింది. ఆర్డర్ల సంఖ్య పెరిగింది. వివిధ నగరాల్లో అవుట్ లెట్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కానీ చేతిలో సరిపడ డబ్బు లేకపోవడంతో బెంగళూరులో ఉన్న ఇల్లును అమ్మి వ్యాపారానికి అనువుగా ఉండేలా అవుట్‌ లెట్‌లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం బెంగళూరు,హైదరాబాద్, పూణేతో పాటు ఇతర నగరాల్లో సమోసాలు అమ్ముతున్నారు. ఇలా సమోసాలు అమ్ముతూ రోజుకు రూ.12 లక్షలు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి ట‌ర్నోవ‌ర్‌ వంద కోట్లు పైనే ఉండే అవ‌కాశం ఉంద‌ని నిధి, శిఖ‌ర్ సంతోషంగా చెబుతున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సిద్ధాంతం తమను ఇక్కడికి దాకా తీసుకొచ్చిందని, భవిష్యత్‌లో విదేశీయులతో తమ సమోసాను టేస్ట్‌ చేయించాలని అనుకుంటున్నట్లు నిధిసింగ్, శిఖర్ సింగ్‌లు విజయ గర్వంతో చెబుతున్నారు.

Published date : 15 Mar 2023 01:43PM

Photo Stories