Skip to main content

Preparation Tips: కంప్యూటర్‌పై పట్టు.. కొలువు కొట్టు

Preparation Tips for Computer Knowledge
Preparation Tips for Computer Knowledge

ఐబీపీఎస్, ఎస్‌బీఐ, ఆర్‌బీఐ, నాబార్డ్‌ వంటి బ్యాంకు పరీక్షల్లో విజయానికి కంప్యూటర్‌ నాలెడ్జ్‌ విభాగం కీలకంగా మారుతోంది. మెయిన్‌ పరీక్షల్లో ఈ విభాగం నుంచి దాదాపు 15–20 ప్రశ్నలు వస్తాయి. బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్, కాన్సెప్ట్స్‌పై అభ్యర్థులకు
ఉన్న అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. బ్యాంకింగ్‌ పోటీ పరీక్షలకు సన్నద్ధమ్యేవారు కంప్యూటర్‌ విభాగంపై అవగాహన పెంచుకుంటే.. మంచి స్కోర్‌ సాధించవచ్చు. ఈ నేపథ్యంలో.. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ పేపర్‌ సిలబస్, పరీక్ష
వి«ధానం, ప్రిపరేషన్‌ గురించి తెలుసుకుందాం...

చ‌ద‌వండి: Banks - Guidance

కంప్యూటర్‌ విభాగం

బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షల్లో టాప్‌ స్కోర్‌ సాధించేందుకు కంప్యూటర్‌ విభాగం  ఉపయోగపడుతుంది. కాబట్టి అభ్యర్థులు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ను పెంచుకునే ప్రయత్నం చేయాలి. మెయిన్‌ పరీక్షల కంప్యూటర్‌ విభాగంలో.. ప్రశ్నలు కొన్ని క్లిష్టంగా, మరికొన్ని సులభంగా ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు కంప్యూటర్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలు, బ్యాంకింగ్‌ రంగంలో కంప్యూటర్‌ ఉపయోగాలు వంటి అంశాలపైనా అవగాహన పొందాలి. అధికశాతం ప్రశ్నలు వీటి నుంచే వస్తాయి. 

సిలబస్‌ ముఖ్యాంశాలు

  • కంప్యూటర్స్‌ హిస్టరీ,జనరేషన్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌
  • కంప్యూటర్స్‌ మెమొరీ, మెమొరీ పరికరాలు 
  • కంప్యూటర్‌ స్టోరేజ్‌ యూనిట్‌
  • నెట్‌ వర్కింగ్, రకాలు–అంశాలు
  • ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ రకాలు, వాటి విధులు
  • కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌
  • హార్డ్‌వేర్‌ పరికరాలు
  • కంప్యూటర్‌ హ్యాకింగ్‌ 
  • వివిధ రకాల వైరస్‌లు
  • ఎంఎస్‌ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్‌ పాయింట్‌ మొదలైనవి
  • డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌
  • ఇంటర్నెట్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
  • సంక్షిప్తాలు.
     

చ‌ద‌వండి: Computer Science

ప్రిపరేషన్‌ ఇలా..

  • ఐబీపీఎస్‌ ప్రొబేషనరీ ఆఫీసర్, క్లర్క్‌ పరీక్షలు జనవరి, ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. ప్రిలిమ్స్‌లో సెలెక్ట్‌ అయితే వెంటనే సులభమైన కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌తో ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. ఈ విభాగాన్ని పూర్తిచేసుకున్న తర్వాత బ్యాంకింగ్‌ అవేర్‌నెస్, కరెంట్‌ అఫైర్స్‌ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ఐబీపీఎస్‌ గతంలో నిర్వహించిన గ్రామీణ, స్టేట్‌ బ్యాంక్‌ ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. తద్వారా ప్రశ్నల సరళీ, ఆయా టాపిక్‌లపై అడుగుతున్న ప్రశ్నల స్థాయిని అంచనా వేయొచ్చు. 
  • మోడల్‌ పేపర్లు, మాక్‌టెస్టులు ప్రాక్టీస్‌ చేయడం ద్వారా ప్రిపరేషన్‌ స్థాయిని అంచనా వేసుకోవచ్చు. దీనివల్ల పరీక్షల్లో చేసే పొరపాట్లను సరిచేసుకోవచ్చు.
  • తొలుత పరీక్షకు సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవాలి. సిలబస్‌లోని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 
  • కంప్యూటర్‌ బేసిక్స్, కంప్యూటర్ల వాడకం, న్యూజనరేషన్‌ కంప్యూటర్లు, కంప్యూటర్‌ పరికరాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి.
  • స్కోరింగ్‌ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉన్న విభాగం కాబట్టి ఆయా కంప్యూటర్‌ టాపిక్స్‌పై సీరియస్‌ ప్రిపరేషన్‌ కొనసాగించాలి.
  • సిలబస్‌ పరంగా ప్రతిఒక్క అంశం చాలా ముఖ్యమైంది. ఏ అంశాన్నీ తేలికగా తీసుకోకూడదు. 
  • ప్రిపరేషన్‌ సమయంలో సొంతంగా నోట్స్‌ తయారు చేసుకోవాలి. తద్వారా పరీక్షకు ముందు బేసిక్‌ కాన్సెప్ట్స్, కంప్యూటర్‌ పరికరాలు, సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్‌ వంటి వాటిని వేగంగా రివిజన్‌ చేసుకోవచ్చు. 
  • మెయిన్స్‌లో ఈ విభాగం పూర్తిగా రీజనింగ్‌తో ముడిపడి ఉంటుంది.కాబట్టి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చేసుకుంటూ..సెక్షనల్‌ కటాఫ్‌పై దృష్టి పెట్టాలి.
  • మాక్‌టెస్ట్‌ సిరీస్‌లు, ప్రాక్టీస్‌ పేపర్లు, క్విజ్‌లు నిత్యం సాధించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • మార్కెట్‌లో అందుబాటులో ఉండే బుక్స్‌తోపాటు గత ప్రశ్నపత్రాలు చదవడం ద్వారా కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌పై అవగాహన ఏర్పడుతుంది. 
  • బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్‌ టెక్నాలజీ, స్పేస్‌ రీసెర్చ్, యూపీఐ, ఈ బ్యాంకింగ్‌.. అలాగే కంప్యూటర్‌ షార్ట్‌కట్‌ కీలు, కొత్తవైరస్‌లు, ప్రోగ్రామ్‌లు, సైబర్‌ సెక్యూరిటీ అంశాలపై పట్టు పెంచుకోవాలి.
  • ఎంఎస్‌ ఆఫీస్, కాన్సెప్ట్స్‌ ఆధారిత విధులు, లక్షణాలు బాగా అధ్యయనం చేయాలి.
  • రివిజన్‌ ఆచరణాత్మకంగా చేయడం వల్ల స్కోరింగ్‌ పెంచుకోవడానికి వీలవుతుంది.
  • విభిన్న సంక్లిష్ట పదాలు, కంప్యూటర్‌ టెర్మినాలజీ తదితర అంశాలు బాగా చదవాలి.
  • మొదట అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్‌ విభాగాలపై దృషిసారించి.. ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే తర్వాత రివిజన్‌ పూర్తిచేయవచ్చు. 
  • కంప్యూటర్‌ విభాగం తేలిగ్గా స్కోర్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కా ప్రణాళికతో ప్రిపరయితే మంచి స్కోర్‌ సాధించవచ్చు.
  • కంప్యూటర్‌పై క్విజ్స్‌ వంటివి ప్రశ్నలు సాల్వ్‌ చేయడం ద్వారా ఈ సెక్షన్‌లో మంచి స్కోరింగ్‌ చేయడానికి అవకాశం ఉంటుంది.
     

చ‌ద‌వండి: Banks - Study Material

Published date : 03 Jan 2022 05:41PM

Photo Stories