TTC Exams: టీటీసీ శిక్షణ పొందిన అభ్యర్థులకు పరీక్షలు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో 43 రోజులపాటు టీటీసీ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షలు నిర్వహించేందుకు టైంటేబుల్ విడుదల చేసినట్లు హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఆయా పరీక్షల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈటీటీసీ పరీక్షలకు హాజరు కావొచ్చని తెలిపారు. ఆగస్టు 12 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆగస్టు 12న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అదే రోజు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (జనరల్ ) సబ్జెక్ట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 3గంటల వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (స్పెషల్) సబ్జెక్టు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ అబ్దుల్‌హై తెలిపారు.
Co-Education Polytechnic College: కో ఎడ్యుకేషన్ పాలిటెక్నిక్ ఏర్పాటు చేయాలి
నేటి నుంచి శాల సిద్ధిపై శిక్షణ
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఎంపిక చేసిన 31 పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఈనెల 26, 27 తేదీల్లో రెండ్రోజులు హసన్‌పర్తి మండలం మిలీనియం పాఠశాలలో శాల సిద్ధి (ప్రమాణాలు, స్వీయ మూల్యాంకణ కార్యక్రమం)పై శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ ఎండీ అబ్దుల్‌హై తెలిపారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 11 ఉన్నత పాఠశాలలు, ఐదు ప్రాథమికోన్నత పాఠశాలలను, 15 ప్రాథమిక పాఠశాలలను శాలసిద్ధికి ఎంపిక చేశారు. హైస్కూళ్లనుంచి ఒక హెచ్‌ఎం, ఇద్దరు టీచర్లు, యూపీఎస్ నుంచి ఒక హెచ్‌ఎం, మరో టీచర్, ప్రాథమిక పాఠశాలల నుంచి ఒక హెచ్‌ఎం, ఒక టీచర్ చొప్పున ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు శిఽక్షణ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన పాఠశాలలకు ఇప్పటికే సంబంధిత క్లస్టర్ రిసోర్స్‌పర్సన్లు, మండల రిసోర్స్ సెంటర్ల ద్వారా సమాచారం అందించారు.