Co-Education Polytechnic College: కో ఎడ్యుకేషన్ పాలిటెక్నిక్ ఏర్పాటు చేయాలి
కరీంనగర్: జిల్లా కేంద్రంలో కో ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్‌లు వేర్వేరు ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో సిరిసిల్లలో మాత్రమే కోఎడ్యుకేషన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉందని, జిల్లా కేంద్రంలో మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉందని, దీనిలో 40శాతం సీట్లు ఎస్సీలకు కేటాయించారని తెలిపారు. జిల్లాకేంద్రంలో కోఎడ్యుకేషన్ పాలిటెక్నిక్ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ కోర్సులతో కళాశాల ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. జిల్లా మంత్రి ఈ విషయంపై చొరువ చూపి కళాశాల ఏర్పాటును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.
Govt Arts and Commerce College: 27, 28 తేదీల్లో న్యాక్ బృందం పర్యటన