Govt Arts and Commerce College: 27, 28 తేదీల్లో న్యాక్ బృందం పర్యటన
Sakshi Education

ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, కా మర్స్ డిగ్రీ కళాశాలను ఈనెల 27, 28 తేదీల్లో జా తీయ అంచనాలు, ప్రమాణాల సంస్థ (న్యాక్) బృందం సందర్శించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జలగం అనిత, కోఆర్డినేటర్ షేక్ ముజీబ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బృందంలో బనారస్ హిందూ వి శ్వవిద్యాలయం, వారణాసి మేనేజ్‌మెంట్ స్టడీస్ ఆ చార్యులు రాజ్‌కుమార్ అధ్యక్షుడిగా, తుంకూర్ విశ్వవిద్యాలయం ఆర్థికశాఖ పరిశోధనాచార్యులు సమన్వయ సభ్యుడిగా, లయోల కళాశాల ప్రిన్సిపాల్ జేవీఆర్ వేదం సభ్యుడిగా వ్యవహరించనున్నట్లు పే ర్కొన్నారు. కళాశాలలోని కోర్సులు, బోధన సౌకర్యాలు, మౌలిక వసతులు, పరిశోధన, విద్యార్థుల విజయాలు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, క్రీడా సౌకర్యాలు, పరీక్షా ఫలితాలు తదితర అంశాలను పరిశీలించి గ్రేడ్ కేటాయించనున్నట్లు తెలిపారు.
Published date : 26 Jul 2023 02:50PM