Skip to main content

Government Employees Holidays 2023 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు.. అలాగే వీరికి కూడా..

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి పండగకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. దీపావళి సెలవు నవంబర్‌ 12వ తేదీన అనగ ఆదివారం వచ్చిన విషయం తెల్సిందే.
Diwali Gift: Holiday for Andhra Pradesh State Government Employees on Sunday, Diwali Holiday on 12th November for AP State Government Staff, Good News: Diwali Holiday for Andhra Pradesh Government Workers, Diwali Holiday Announcement for AP State Government Employees, Government Employees Diwali Holidays 2023 Telugu News, Andhra Pradesh State Government's Diwali Gift to Employees,

అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానిని సోమవారానికి (నవంబర్‌ 13వ తేదీ) మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

☛ November Schools and Colleges Holidays List 2023 : నవంబర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు వ‌చ్చే సెల‌వులు ఇవే.. దాదాపు 10 రోజులు పాటు..

ఎలా అంటే..?
నవంబర్‌ 11వ తేదీన రెండో శనివారం, నవంబర్‌ 12వ తేదీన ఆదివారం సెలవులు కాగా.. దీపావళి పండుగ సెలవును కూడా తొలుత ఆదివారమే అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా ప్రభుత్వం దీపావళి సెలవును నవంబర్‌  13వ తేదీ సోమవారం ఇవ్వాలని నిర్ణయించింది. దీపావళి పర్వదినం (తిథి ద్వయం)ను పురస్కరించుకుని 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. న‌వంబ‌ర్‌ 13వ తేదీన సోమ‌వారం ఉద్యోగులతో పాటు ఆఫీసులు, వ్యాపార సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు శ‌నివారం, ఆదివారం, సోమ‌వారం వ‌రుసగా రెండు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.

☛ Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తూ..
రెండో శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు వచ్చాయి. కాగా.. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.64 శాతం డీఏను విడుదల చేయడంతోపాటు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తూ జారీ చేయడం తెలిసిందే. ఉద్యోగులకు వారి బేసిక్‌ పేలో 22.75 శాతం నుంచి 26.39 శాతానికి పెంచిన కరువు భత్యాన్ని 2022 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులిచ్చిన విషయం విదితమే. తాజాగా దీపావళి సెలవును సోమవారానికి మార్చడంతో ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్స్, కాలేజీలకు కూడా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.

తెలంగాణలో కూడా నవంబర్‌ 13వ తేదీన..?

government employees news happy diwali news telugu

ఇలాగే తెలంగాణలో కూడా నవంబర్‌ 13వ తేదీన (సోమవారం) సెలవు ఇస్తే.. స్కూల్స్, కాలేజీలకు, ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.

➤ గుడ్‌న్యూస్‌.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?

Published date : 07 Nov 2023 03:20PM

Photo Stories