Skip to main content

Andhra University Topper: ఏయూ టాపర్‌గా నిలిచిందుకు 18 అవార్డులు

త‌న కృషి, ప‌ట్టుద‌ల‌తో ఆంధ్రా యూనివ‌ర్సిటీకి టాపర్‌గా విజ‌యం సాధించింది ఈ విద్యార్థిణి. మ‌రికొంద‌రికి ఆద‌ర్శంగా నిలిచే స్థాయిలో విజ‌యం పొందినందుకు ఈ విద్యార్థిని అంద‌రూ అభినందిస్తున్నారు. ఈ యువతి విజ‌యం గురించి తెలుకుందాం...
Student Manasa of Andhra University achieves top rank
Student Manasa of Andhra University achieves top rank

సాక్షి ఎడ్యుకేష‌న్: సాధారణ కుటుంబంలో జన్మించి చదువుల తల్లిగా ఎదిగింది. టాపర్‌గా నిలవడానికి కావాల్సింది బ్యాక్‌గ్రౌండ్‌ కాదని, కేవలం కష్టపడి చదవడమేనని రుజువు చేసింది. టాపర్‌గా నిలవడానికి అహర్నిశలు కృషి చేసి ఆంధ్రాయూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలిచి నేటి యువతీ, యువకులకు ఆదర్శంగా నిలిచింది చీపురుపల్లి పట్టణానికి చెందిన గవిడి మానస. 2020–21 విద్యాసంవత్సరంలో మానస ఆంధ్రాయూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్‌ పూర్తి చేసి టాపర్‌గా నిలిచింది.

Reliance Foundation Scholarship 2023 : విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కొక్కరికి రూ.2 లక్షల స్కాలర్‌షిప్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

అయితే ఆ విద్యా సంవత్సరానికి మానస యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలవడంతో ఆమెను 18 అవార్డులు వరించాయి. వాటిలో 4 బంగారు పతకాలు ఉన్నాయి. యూనివర్సిటీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు వివిధ సంస్థలు పతకాలు, ప్రశంసలు ఇస్తుంటాయి. అందులో భాగంగానే మానసకు 18 అవార్డులు లభించాయి. అయితే గత మూడేళ్లుగా ఆంధ్రాయూనివర్సిటీలో స్నాతకోత్సవాలు జరగకపోవడంతో వరుసగా మూడు స్నాతకోత్సవాలును శనివారం నిర్వహించారు.

ఈ స్నాతకోత్సవానికి గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జీఎంఆర్‌ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా మానస మెరిట్‌ ధ్రువీకరణతో బాటు పతకాలు అందుకుంది. ప్రస్తుతం ఆంధ్రాయూనివర్సిటీలోనే భౌతికశాస్త్రంపై మానస పీహెచ్‌డీ చేస్తోంది.

ఇదిలా ఉండగా మానస తండ్రి శాంతారావు ఇందిరక్రాంతి పథం(వెలుగు)లో సీసీ గా విధులు నిర్వహిస్తుండగా తల్లి పైడిరాజు వీఓ ఏగా పని చేస్తోంది. మానస ఒకేసారి 18 అవార్డులు తెచ్చుకోవడం, యూనివర్సిటీ టాపర్‌గా నిలవడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.

UTF Work Shop: శిక్ష‌ణ నిర్వాహణ తో బోధ‌న స‌మ‌యం వృధా

Published date : 11 Sep 2023 04:18PM

Photo Stories