Reliance Foundation Scholarship 2023 : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షల స్కాలర్‌షిప్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
2023-24 విద్యా సంవత్సరానికి 5,000 విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ఈ స్కాలర్‌షిప్ ఇవ్వనున్నది. అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది.
☛ Inspiring Story : హ్యాట్స్ ఆఫ్ జయలక్ష్మి.. చెత్త బండి లాగుతూ.. చదువుతూ.. ఐఏఎస్..
దరఖాస్తు చివరి తేదీ ఇదే..
ఈ స్కాలర్‌షిప్ దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు 2023 అక్టోబర్ 15 తేదీలోపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్ అన్ని బ్రాంచ్‌లలోని మొదటి సంవత్సరం రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుంది.
వీరికి ఎక్కువ ప్రాధాన్యత..
ప్రతిభగల విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ఈ స్కాలర్‌షిప్ ఉపయోగపడుతుంది. రిలయన్స్ ఫౌండేషన్ అందించే ఈ స్కాలర్‌షిప్ మెరిట్ ఆధారంగా చేసుకుని అందివ్వడం జరుగుతుంది. ఇందులో ఎంపికైన ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
☛ Read : Microsoft Courses: విలువైన మైక్రోసాఫ్ట్ కోర్సులు
ఇందులో మహిళా విద్యార్థులకు, వికలాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిభ ఉన్న విద్యార్థులు డబ్బు గురించి ఆందోళన చెందకుండా చదువుకోవాలనే సదుద్దేశ్యంతో రిలయన్స్ సంస్థ ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఇందులో కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
గత సంవత్సరం భారీగా దరఖాస్తులు..
2022-23 విద్యాసంవత్సరంలో కూడా సంస్థ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. దీని కోసం అప్పుడు లక్ష మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ఎంపికైన వారిలో 51 శాతం మహిళలు, 97 మంది వికలాంగులు ఉన్నట్లు తెలిసింది. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి www.scholarships.reliancefoundation.org వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
Read : ITI Admission 2023-24: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
Tags
- reliance foundation scholarship applications 2023-24
- reliance foundation scholarship 2023-24
- reliance foundation scholarship 2023-24 details
- reliance foundation scholarship 2023 24 application form
- reliance foundation scholarship eligibility
- reliance foundation scholarship amount
- reliance foundation scholarship aptitude test
- Reliance Foundation Undergraduate Scholarships 2023-24
- sakshi education scholarships