Microsoft Courses: విలువైన మైక్రోసాఫ్ట్ కోర్సులు
సాక్షి ఎడ్యుకేషన్: మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్ కోర్సులు చాలా విలువైనవి. వేలాది రూపాయలు వెచ్చించినా ఇలాంటి అడ్వాన్సెడ్ కోర్సులు అందుబాటులోకి రావు. ఇలాంటి అమూల్యమైన కోర్సులు ఉచితంగా విద్యార్థులకు అందజేయడం గొప్ప అంశం. జేఎన్‌టీయూ (ఏ)లో ఈ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పటికే 25 వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. దాదాపు రూ.30 కోట్లు వెచ్చించి ఇలాంటి కోర్సులు అందిస్తున్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ హేమచంద్రారెడ్డికి అభినందనలు.
– ప్రొఫెసర్ జింకా రంగజనార్ధన, వీసీ, జేఎన్‌టీయూ అనంతపురం
APPSC Group-2: జాగ్రఫీని ఇలా చదివితే సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు
ఇంటర్న్‌షిప్ తప్పనిసరి
డిగ్రీ కోర్సుల్లో ఆనర్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. నాలుగేళ్ల కాల వ్యవధితో కూడిన డిగ్రీ కోర్సుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రత్యేక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించింది. ఇంటర్న్‌షిప్ చేస్తే పరిశ్రమల అనుభవం గడించవచ్చు. ఈ క్రమంలో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశారు. ఈ మేరకు కార్యాచరణ పూర్తి చేశాం. ఏఏ కంపెనీలకు విద్యార్థులకు వెళ్లాలి అనే అంశంపై కసరత్తు పూర్తయింది. కోర్సుల్లో అభ్యసనాభవమే కాకుండా... పరిశ్రమల అనుభవం కూడా వచ్చే ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల భవితకు దోహదపడుతాయి.
–ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణా రెడ్డి, వీసీ, ఎస్కేయూ
Interacting with Students: జెడ్పీ హైస్కూల్ ను సందర్శించిన రాష్ట్ర డైరెక్టర్