Interacting with Students: జెడ్పీ హైస్కూల్ ను సందర్శించిన రాష్ట్ర డైరెక్టర్
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన చదువులు సాగించి భవిష్యత్‌కు పటిష్టమైన బాటలు వేసుకోవాలని విద్యా శాఖ శిక్షణ విభాగం రాష్ట్ర డైరెక్టర్ మస్తానయ్య అన్నారు. గురువారం విశాఖ జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. అడవివరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన పదో తరగతి విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ వినియోగం ఎలా ఉందనేది తెలుసుకున్నారు.
Teacher Posts: పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తులు మొదలు
ఐఎఫ్‌పీ ఎలా ఉపయోగపడుతుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొస్తుందన్నారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్‌పై పాఠ్యాంశాల బోధన వల్ల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే అవకాశం ఉంటుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఇమంది పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.