Skip to main content

Teacher Posts: పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుల పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు మొద‌లు

ఇటీవ‌లే ప్ర‌క‌టించిన‌ట్టు ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌లో ఉపాధ్య‌యుల పోస్టులు ఖాళీగా ఉండ‌డంతో అవ‌కాశాన్ని వినియోగించుకోనే వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని తెలుపుతూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు.
teaching applications open at ekalavya school
teaching applications open at ekalavya school

సాక్షి ఎడ్యుకేష‌న్: రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాల్లో 2023–24 విద్యా సంవత్సరంలో గెస్టు ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు రిటైర్డ్‌, జూనియర్‌ లెక్చరర్స్‌ నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పీవో సూరజ్‌ గనోరే తెలిపారు.

Schools for Tribals: గిరిజ‌న విద్యార్థుల‌కు పాఠ‌శాల‌లు ప్రారంభం

ఏకలవ్య పాఠశాలల్లో రెగ్యులర్‌ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ జరుగుతుందని, అప్పటి వరకు ఇతర శాఖల ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం జరుగుందన్నారు. ఈ నెల 14లోగా దరఖాస్తులను మెయిల్‌ చేయాలని తెలిపారు. పూర్తి వివరాలను వై.రామవరం ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణను సంప్రదించాలని ఆయన కోరారు.

Published date : 06 Sep 2023 04:08PM

Photo Stories