Skip to main content

Smart Cities: దేశంలో 12 గ్రీన్‌ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలకు గ్రీన్‌సిగ్నల్‌.. ఏపీలోని రెండు జిల్లాల్లో..

వికసిత్‌ భారత్‌ దృష్టితో ఏపీలో రెండు గ్రీన్‌ఫీల్డ్‌ ఇండ్రస్టియల్‌ స్మార్ట్‌ సిటీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
Cabinet Approves 12 New Greenfield Industrial Smart Cities Union Cabinet members approving smart city projects

ఆగ‌స్టు 28వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.  భార‌త దేశంలోని 10 రాష్ట్రాల్లో ఆరు ప్రధాన ఇండస్ట్రియల్‌ కారిడార్లలో రూ.28,602 కోట్ల వ్యయంతో 12 ప్రపంచస్థాయి గ్రీన్‌ఫీల్డ్‌ ఇండ్రస్టియల్‌ స్మార్ట్‌ సిటీలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

ఇందులో భాగంగా ఏపీలో రూ.2,786 కోట్ల వ్యయంతో ఓర్వకల్లులో, రూ.2,137 కోట్లతో కొప్పర్తిలో గ్రీన్‌ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇదేకాకుండా ఏపీలో 68 ప్రైవేట్‌ ఎఫ్‌ఎం స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ఏపీలోని రెండు జిల్లాల్లో.. 
ఏపీలోని కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భారీ పారిశ్రామిక హబ్‌లు రానున్నాయి. 

ఓర్వకల్లులో.. గ్రీన్‌ఫీల్డ్‌ ఇండ్రస్టియల్‌ స్మార్ట్‌ సిటీ 2,621 ఎకరాల్లో నిర్మాణం కానుంది. నాన్‌ మెటాలిక్‌ మినరల్స్, ఆటోమొబైల్‌ పరికరాలు, పునరుత్పాదక రంగం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఏరో స్పేస్, డిఫెన్స్‌ హార్డ్‌వేర్, ఫార్మాస్యూటికల్స్, జెమ్స్‌ జ్యువెలరీ, వస్త్ర రంగాల ద్వారా 45,071 మందికి ఉపాధి కల్పించనున్న ఈ ప్రాజెక్ట్‌లో రూ.12 వేల కోట్ల పెట్టుబడికి అవకాశాలున్నాయి. 

Crop Varieties: మార్కెట్‌లోకి వ‌చ్చిన‌ మూడు కొత్త వంగడాలు ఇవే..

కొప్పర్తిలో.. పారిశ్రామిక హబ్‌ 2,596 ఎకరాల్లో నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్ట్‌ వ్యయం రూ.2,137 కోట్లు కాగా, రూ.8,860 కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా పునరుత్పాదక రంగం, ఆటోమొబైల్‌ పరికరాలు, మెటాలిక్‌ మినరల్స్, నాన్‌ మెటాలిక్‌ మినరల్స్, టెక్స్‌టైల్స్, కెమికల్స్, ఇంజనీరింగ్‌ వస్తువుల రంగాల్లో 54,500 మందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి.

కొత్త ఎఫ్‌ఎం స్టేషన్ల ఏర్పాటు ఇలా..
దేశంలోని మొత్తం 234 నగరాల్లో 730 ప్రైవేట్‌ ఎఫ్‌ఎం కేంద్రాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఆదోని, అనంతపురం, భీమవరం, చిలకలూరిపేట, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గుంతకల్లు, హిందూపురం, మచిలీపట్నం, మదనపల్లి, నంద్యాల, నరసరావుపేట, ఒంగోలు, ప్రొద్దుటూరు, శ్రీకాకుళం, తాడిపత్రి, విజయనగరం పట్టణాల్లో మూడేసి చొప్పున, కాకినాడ, కర్నూలు పట్టణాల్లో నాలుగు చొప్పున ప్రైవేట్‌ ఎఫ్‌ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.

AP Government: ఏపీలో 12 ప్రాజెక్టుల పేర్లు మార్పు.. ప్ర‌స్తుత పేర్లు ఇవే..

Published date : 29 Aug 2024 03:28PM

Photo Stories