Scholarships: 600 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్
Sakshi Education
సాక్షి, చెన్నై: చెన్నైలోని ఎస్‌ఎస్‌ఎన్ – శివనాడార్ యూనివర్సిటీలో 600 మంది విద్యార్థులకు రూ.5 కోట్లు విలువ చేసే స్కాలర్ షిప్‌లను పంపిణీ చేశారు.
నవంబర్ 20న జరిగిన కార్యక్రమంలో అర్హులైన విద్యార్థులకు రిటైర్డ్ ఐఏఎస్, ఎస్‌ఈఏసీ చైర్మన్ కె.దీన బంధు, ఎస్‌ఎస్‌ఎన్ చాన్స్‌లర్ ఆర్. శ్రీనివాసన్, ప్రొ చాన్స్‌లర్ డాక్టర్ కళా విజయకుమార్, వీసీ డాక్టర్ శ్రీమన్ కుమార్ భట్టాచార్య, ప్రిన్సిపల్ వీఈ అన్నామలై స్కాలర్ షిప్‌లను అందజేశారు.
ఈ సందర్భంగా దీనబంధు మాట్లాడుతూ, అన్ని వర్గాలలో అర్హులైన , ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, వీరందరికీ తోడ్పాటు అందించే విధంగా విద్యా సంస్థలు ముందుకెళ్లాలని సూచించారు. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలతో పాటు మేథా సంపత్తిని పెంచే మంచి అంశాలు, అవకాశాల కోసం విద్యార్థులు అన్వేషించాలని పిలుపునిచ్చారు.
ఆర్. శ్రీనివాసన్ మాట్లాడుతూ, అర్హులైన విద్యార్థులకు ప్రోత్సాహం, తోడ్పాటు అందించడం లక్ష్యంగా ఈ స్కాలర్ షిప్‌లను అందజేశామన్నారు.
Published date : 21 Nov 2023 12:46PM