Solar Power: ట్రిపుల్ ఐటీకి సౌర విద్యుత్
Sakshi Education
![solar power facility in triple IT campus](/sites/default/files/images/2023/08/03/triple-it-campus-1691051545.jpg)
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) క్యాంపస్‌కు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడ జగదీశ్వరరావు చెప్పారు. 750 కిలో వాట్స్ విద్యుత్ సామర్థ్యం గల సౌర వి ద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు బుధవారం నెడ్‌క్యాప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యుత్ ఆదా చేయటంలో భాగంగా సౌర విద్యుత్‌పై దృష్టి పెట్టినట్లు చెప్పారు. వర్సిటీలో భవిష్యత్తులో 6400 మంది విద్యార్థులు ఉంటారని, టీచింగ్, నాన్ టీచింగ్ సైతం వేల సంఖ్యలో ఉంటారని అన్నారు. అన్ని బ్లాక్‌లకు సౌర విద్యుత్ సరఫరా లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. నెడ్‌క్యాప్ సంస్థ ప్రతినిధి నాగార్జున రెడ్డి, ఓఎస్‌డీ ఎల్.సుధాకర్‌బాబు, అకడమిక్ డీన్ కొర్ల మోహన్‌కృష్ణ పాల్గొన్నారు.
Published date : 03 Aug 2023 02:02PM