Skip to main content

Sankranthi Holidays 2024 For College Students : కాలేజీల‌కు సంక్రాంతి సెలవులు ఇవే.. కానీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావిడి ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే స్కూల్స్‌, కాలేజీల‌కు ముందుగానే సెల‌వులు ప్ర‌క‌టించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్కూల్స్‌, కాలేజీల‌కు జ‌న‌వ‌రి 3వ తేదీన‌(బుధ‌వారం) సంక్రాంతి పండుగ సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది.
Sankranti Holidays in Telangana: Schools and Colleges on Break from 3rd January  Sankranthi Holidays 2024 For College Students Details  Sankranti Festival Holidays Officially Declared   Telangana Schools and Colleges Holiday Announcement on 3rd January

తెలంగాణ‌లోని స్కూల్స్‌కు జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఇక, జనవరి 13న రెండో శనివారం కాగా.. 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. అలాగే జనవరి 25, 26న కూడా సెలవు రానుంది.

 Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

కాలేజీల‌కు సంక్రాంతి సెలవులు ఇవే.. 
తెలంగాణలోని ఇంటర్మీడియట్ కాలేజీల‌కు జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులను ఇంట‌ర్ బోర్డ్‌ ప్రకటించింది. మొత్తం 4 రోజుల పాటు కాలేజీల‌కు సెల‌వులు రానున్నాయి. జనవరి 17వ తేదీన‌ తిరిగి ఇంటర్మీడియట్ కళాశాలు తెరుచుకోనున్నాయి. అలాగే డిగ్రీ, ఇంజ‌నీరింగ్ కాలేజీల‌కు కూడా దాదాపు నాలుగు రోజులు పాటు సంక్రాంతి సెలవులు రానున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్య‌తం వైభవంగా జ‌రుపుకునే పండ‌గ‌ల్లో సంక్రాంతి పండ‌గ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంటుంది. తెలంగాణ‌లో కంటే.. ఏపీలోనే సంక్రాంతి పండ‌గ ఘ‌నంగా జ‌రుపుకుంటారు. 2024లో సంక్రాంతి పండ‌గ‌కు ఏపీ ప్ర‌భుత్వం స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగానే సెల‌వులు ఇచ్చారు. ఈ సారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్రాంతి సెల‌వులు నాలుగు నుంచి ఆరు రోజులు పాటు రానున్నాయి. 

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

జ‌న‌వ‌రి 13వ తేదీన రెండో శ‌నివారం చాలా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఉంటుంది. అలాగే జ‌న‌వ‌రి 14వ తేదీన భోగి పండ‌గ.. ఆదివారం వ‌చ్చింది. జ‌న‌వ‌రి 15వ తేదీన సంక్రాంతి పండ‌గ‌.. సాధార‌ణంగా సెల‌వులు ఉంటుంది. అలాగే జ‌న‌వ‌రి 16వ తేదీన ఆప్ష‌న‌ల్ హాలిడే ఇచ్చారు. దీంతో పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు మ‌రో రెండు రోజులు పాటు అద‌నం సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. దీంతో స్కూల్స్, కాలేజీల‌కు దాదాపు 6 రోజులు పాటు స్కూల్స్, కాలేజీల‌కు సెలవులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Published date : 03 Jan 2024 07:50PM

Photo Stories