Nannaya University: యూనివర్సిటీలో పెండింగ్ పనులకు శ్రీకారం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో రూ.37.78 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ప్రాంగణంలో కొంతకాలంగా నిలిచిపోయిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ భవనానికి రూ.20.05 కోట్లు, ఎగ్జామినేషన్ భవనానికి రూ.8.25 కోట్లు, స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ భవన నిర్మాణానికి రూ.1.90 కోట్లు, పార్కింగ్ షెడ్‌కు రూ.8.3 లక్షల చొప్పున రూ.30.28 కోట్లు వెచ్చించి పెండింగ్ పనులను పునఃప్రారంభించనున్నారు.
AP Tenth Exams: టెన్త్ పరీక్షలకు అన్ని విధాల భద్రతా చర్యలు
ఈ పనులు ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్న కాకినాడలోని ఎంఎస్‌ఎన్ క్యాంపస్‌లో రూ.4.5 కోట్లతో మహిళా వసతి గృహాన్ని, రూ.3 కోట్లతో రోడ్లను నిర్మించనున్నారు. వీటి పనులను వీసీ ఆచార్య కె.పద్మరాజు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, ఈసీ మెంబర్లు పాల్గొన్నారు.