New Courses for Students: నాగార్జున యూనివర్సిటీలో కొత్త కోర్సులు
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కొత్త కోర్సులను వీసీ ఆచార్య పి.రాజశేఖర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన కోర్సుల్లో ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఎంబీఏ మీడియా మేనేజ్‌మెంట్, ఎంఎస్సీ డేటా సైన్స్, ఎంఎస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎంఏ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్ కోర్సులు ఉన్నాయని చెప్పారు.
Admission in Andhra University: ఏయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
మారుతున్న పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు నూతన కోర్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన కోర్సులలో ఫ్యాకల్టీ నియామకం, మౌలిక సదుపాయాలు కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
Unemployment: జూన్ త్రైమాసికంలో తగ్గిన నిరుద్యోగం
డిగ్రీ ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం వీసీ ఆచార్య రాజశేఖర్ విడుదల చేశారు. యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. డిగ్రీ నాల్గవ సెమిస్టర్ ఫలితాల్లో 61 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఏసీఈ ఆర్.ప్రకాష్రావు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24 ఆఖరు తేదీగా నిర్ణయించామన్నారు. ఫీజు ఒక్కో పేపర్‌కు రూ.1,240 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.