Janapriya School of Nursing: నర్సింగ్ కళాశాల ఎండీ పై విద్యార్థుల ఆగ్రహం
సాక్షి ఎడ్యుకేషన్: స్థానిక ఎల్విన్‌పేటలో జనప్రియ స్కూల్ ఆఫ్ నర్సింగ్ (నేషనల్ నర్సింగ్ కళాశాల) యాజమాన్యం వ్యవహార శైలిపై విద్యార్థులు భగ్గుమన్నారు. కళాశాల హాస్టల్ నిర్వహణ సరిగ్గా లేదని, అసభ్య పదజాలంతో తమను ఎండీ దూషిస్తున్నారని ఆగ్రహిస్తూ విద్యార్థులు శుక్రవారం కళాశాల బయట ఆందోళకు దిగారు. అర్హులైన బోధన సిబ్బంది లేకుండా కళాశాలను నడిపిస్తున్నారని ఆరోపించారు.
Degree Examinations: సెమిస్టర్ పరీక్షలో ఫెయిల్ అయిన వారికి ఇన్‌స్టంట్ పరీక్ష
సమస్యలు చెప్తే ఎండీ వెంకటరావు అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులంతా కళాశాల నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి ఏఓకు వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు కళాశాల ఆవరణలో జరిగిన నిరసనలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. టూ టౌన్ సీఐ నాగేశ్వర్ నాయక్ జోక్యంతో విద్యార్థులు నిరసన విరమించి కలెక్టరేట్‌కు వెళ్లారు.