Admission in Osmania University: ఎమ్మెస్సీ డాటా సైన్స్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో కొత్తగా ప్రవేశపెట్టిన ఎమ్మెస్సీ డాటా సైన్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 8 నుంచి 17 వరకు, రూ.500 అపరాధ రుసముతో 19 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని పీజీ టీఎస్‌పీజీఈటీ–2023 కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. ఓయూ, తెలంగాణ మహిళ విశ్వవిద్యాలయంలో 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఎమ్మెస్సీ డాటా సైన్స్ కోర్సులో ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ చూడవచ్చు.
Published date : 07 Aug 2023 03:41PM