Skip to main content

Awards: ఇన్‌స్పైర్‌ మనక్‌కు నామినేషన్లు పంపాలి

నల్లగొండ : 2023–24 విద్యా సంవత్సరానికి విద్యార్థులు ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డులకు నామినేషన్లు గపంపాలని డీఈఓ భిక్షపతి కోరారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సెయింట్‌ ఆల్ఫోన్సెస్‌ గపాఠశాలలో పాఠశాలల హెచ్‌ఎంలు, సైన్స్‌ ఉపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈనెల 3 లోపు విద్యార్ధులు తమ ప్రాజెక్టును ఇన్‌స్పైర్‌ మనక్‌ యాప్‌ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని యజమాన్యాల పాఠశాలల్లో 6వ నుండి 10వ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులు బ్యాంక్‌ ఖాతా, ప్రాజెక్టు వివరాలు వెబ్‌ అడ్రస్‌ లేదా యాప్‌ ద్వారా గడువులోపు జిల్లాలోని ప్రతి పాఠశాల తప్పనిసరిగా 5 ప్రాజెక్టులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమములో కొమ్ము శ్రీనివాస్‌, రామచంద్రయ్య, జిల్లా సైన్స్‌ అధికారి లక్ష్మీపతి, శ్రవణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Also read: Sports School: ఆగస్టు 13న క్రీడా పాఠశాలల్లో రాష్ట్రస్థాయి ఎంపికలు

Published date : 09 Aug 2023 07:28PM

Photo Stories