Skip to main content

Government Gurukul Admissions : ప్ర‌భుత్వ గురుకులాల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు.. ఈ త‌ర‌గ‌తుల‌కే..

ప్ర‌భుత్వ గురుకుల పాఠ‌శాల‌ల్లో చేరేందుకు అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న విద్యార్థులకు శుభ‌వార్త‌..
Government gurukul schools admissions 2025 with entrance exam  Government Gurukul admission notification 2025-26  Eligible students from classes five to nine  Academic year 2025-26 admission process  Gurukul entrance exam for classes five to nine

సాక్షి ఎడ్యుకేష‌న్: 2025-26 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు అర్హ‌త ఉన్న విద్యార్థులు ప్ర‌భుత్వ గురుకులాల్లో ప్ర‌వేశం పొందేందుకు నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేశారు.

Foreign Education : అమెరికాలో భార‌తీయుల హ‌వా.. ఉన్న‌త విద్య‌కు బాట‌గా..

ఈ నేప‌థ్యంలో గురుకులాల్లో ప్రవేశాలకు నిర్వ‌హించే పరీక్షకు సంబంధించిన వివరాల‌ను మండలంలోని హుజూర్ నగర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ దున్న వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థుల‌కు వ‌చ్చే నెల‌.. ఫిబ్రవరి 2 వరకు ప్రవేశ పరీక్షకు ద‌రఖాస్తులు చేసుకునే వీలు ఉంటుందన్నారు. కుల, ఆదాయ, పుట్టిన తేదీ ధృపపత్రాలతో పాటు ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో దరఖాస్తుకు జత చేయాలని వివరించారు ప్రిన్సిపాల్‌.

Gurukul Admissions : గురుకుల విద్యాల‌యాల్లో ఖాళీలు.. ముఖ్య‌మైన వివ‌రాలు ఇవే..!!

ఆన్‌లైన్ లో https://tgcet.cgg.gov.in ద్వారా దరఖాస్తులు పంపించాలని వెంకటేశ్వర్లు తెలిపారు. ధృవ పత్రాలు సత్వరమే పొందేందుకు కలెక్టరేట్‌లో పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సహాయక కేంద్రం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాల‌న్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 15 Jan 2025 10:08AM

Photo Stories