JEE Main 2025 City Intimation Slip : వచ్చేవారంలో జేఈఈ మెయిన్ 2025 హాల్‌టికెట్స్.. అందుబాటులో సీటి ఇంటిమేషన్ స్లిప్స్..

సాక్షి ఎడ్యుకేషన్: 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశం కల్పించేందుకు నిర్వహించే పరీక్ష జేఈఈ మెయిన్. ప్రతీ ఏటా నిర్వహించే ఈ పరీక్షను ఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ 2025 మొదటి విడత రాత పరీక్షకు సంబంధించిన సీటి ఇంటిమేషన్ స్లిప్పులు తాజాగా విడుదలయ్యాయి. ఇక త్వరలోనే అడ్మిట్ కార్డులు కూడా విడుదల కానున్నాయి. కాగా జేఈఈ మెయిన్-2025 తొలి విడత పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 28, 31 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే.
CAT Exam: ఐఐఎంల మలిదశ.. మెరిసేదెలా!.. క్యాట్‌లో రాణించేందుకు మార్గాలు..
అయితే, త్వరలోనే ఈ పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లు కూడా విడుదల కానున్నాయి. పరీక్షలు ఈనెల 22న ప్రారంభం అవుతుండగా, పరీక్షకు సరిగ్గా 3 రోజుల ముందు హాల్‌టికెట్లను విడుదల చేస్తారు. ప్రస్తుతం, ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి సీటి ఇంటిమేషన్ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
BEE SSE Jobs: బీఈఈ, న్యూఢిల్లీలో 16 సీనియర్ సెక్టార్ ఎక్స్‌పర్ట్స్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
జనవరి 22న మొదలయ్యే బీఈ/బీటెక్ పేపర్1 పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. మొదటి షిఫ్ట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెకండ్ షిఫ్ట్ 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతాయి. జనవరి 31 తేదీన మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు బీఆర్క్/ బీ ప్లానింగ్ సెకండ్ షిఫ్ట్‌లో పేపర్ 2ఏ, 2బీ పరీక్షలు జరగనున్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- JEE Main 2025
- hall ticket for jee main exam
- january 22nd
- city intimation slip
- jee main 2025 hall ticket
- btech and b arch admissions
- entrance exam for engineering courses
- joint entrance exam for engineering
- city intimation slip download for jee main exam 2025
- jee main 2025 candidates
- january 2025
- National Institute of Technology Admissions
- National Institute of Technology Admissions for Engineering
- NIT admissions for engineering courses
- Education News
- Sakshi Education News