JEE Mains 2025 Tips : జేఈఈ మెయిన్స్ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్.. ఈ 5 టిప్స్‌తో స్ట్రెస్‌ను తగ్గించుకోండి..!!

సాక్షి ఎడ్యుకేషన్: రానున్న రోజుల్లో ఇంజినీరింగ్, ఐఐటీ ఎంట్రన్స్‌కు జేఈఈ పరీక్షను నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం తీవ్రస్థాయిలో ప్రిపరేషన్ ను కొనసాగిస్తున్నారు. అయితే, ఈ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో విద్యార్థులు పాజిటివ్ మార్కులు సాధించడం ఎంత ముఖ్యమో, నెగిటివ్ మార్కుల నుంచి తప్పించుకోవడం కూడా అంతే ముఖ్యం.. కాగా, జేఈఈ మెయిన్స్ 2025లో నెగిటివ్ మార్కులను తగ్గించుకునేందుకు, వాటి నుంచి తప్పించుకునేందుకు ఉపయోగపడే కొన్ని టిప్స్‌ని ఇప్పుడు తెలుసుకుందాం..
ఎగ్జామ్ పాటర్న్అర్థం చేసుకోవాలి : పరీక్షలో 300 మార్కుల కోసం 75 ప్రశ్నలు ఉంటాయి. మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలు ఉంటాయి. ప్రతి కరెక్ట్ సమాధానానికి 3 మార్కులు వస్తాయి. సమాధానం తప్పు అయితే ఒక మార్కు పోతుంది. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు ఎలాంటి పాజిటివ్, నెగిటివ్ మార్కులు ఉండవు. పరీక్షలో గెస్వర్క్లను తగ్గించేందుకు ఈ జేఈఈ మెయిన్స్ నెగిటివ్ మార్కింగ్ సిస్టెమ్ని తీసుకొచ్చారు.
తెలిసింది రాయాలి : ఎటువంటి పరీక్షలోనైనా ముందు క్వశ్చన్ పేపర్ని క్షుణ్ణంగా పరిశీలించి, నాకు ఇది బాగా తెలుసు అన్న ప్రశ్నలను ఎంచుకొని, దానిని మొదట పూర్తి చేయండి. దీంతో మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎటువంటి పరీక్షలో అయినా, కఠిన ప్రశ్నలతో అస్సలు మొదలుపెట్టకూడదు. టైమ్ ఎక్కువపడుతుంది. మీ మీద స్ట్రెస్ పెరుగుతుంది.
JEE Main Exam 2025 :జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలు వెల్లడి
గెస్వర్క్కి దూరంగా ఉండండి : ఈ పరీక్షలో గెస్వర్క్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇటువంటి పరీక్షల్లో గెస్‌వర్క్ ఒక్కసారి సహకరిస్తుందేమో కాని, దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండడంతో గెస్వర్క్లు నష్టం చేస్తాయి. తప్పు సమాధానానికి మార్కులు పోతాయి. ప్రతి మార్కు చాలా కీలకం కదా! ప్రశ్నకు సమాధానం తెలిసినా, డౌట్‌గా ఉంటే.. దాన్ని స్కిప్ చేయండి. అక్యురసీ మీద ఫోకస్ చేయండి. ఇలా చేస్తేనే నెగిటివ్ మార్క్‌ల నుంచి తప్పించుకోగలరు. కచ్చితంగా సమాధానం ఇవ్వాలని అనిపిస్తే, ఎలిమినేషన్ ప్రాసెస్ చేపట్టండి. ఒక్కో ఆప్షన్ని తొలగిస్తూ రండి. ఇలా చేస్తే కరెక్ట్ సమాధానం ఇచ్చే ఛాన్స్‌లు పెరుగుతాయి.
టైమ్ మేనేజ్మెంట్ ముఖ్యం : పరీక్షకు ప్రిపేర్ అయ్యే సమయంలో, పరీక్షను రాసే సమయంలో విద్యార్థులు టైమ్ మేనేజ్మెంట్ను అత్యంతంగా పాటించాలి. ఇది పరీక్షల సమయంలో చాలా కీలకం. 3 గంటల పరీక్షలో ఎఫీషియెన్స్ చాలా అవసరం. టైమ్‌ని మీరు ఎంత బాగా వినియోగించుకోగలిగితే, చివరిలో ఒత్తిడి లేకుండా, నెగిటివ్ మార్కింగ్కి సంబంధించిన తప్పులు చేయరు.
గతంలోని పరీక్ష పేపర్ల పరిశీలన : గతంలోని జేఈఈ క్వశ్చన పేపర్స్‌ని ప్రాక్టీస్ చేస్తే మంచిది! పరీక్ష కఠినత్వంపై మీకు అంచనా వస్తుంది. మీ పరీక్ష సమయంలో రాసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ పరీక్షకు తగ్గట్టు ప్రిపేర్ అవుతారు.
ఫోకస్డ్‌గా అండ్ రీ చెక్ : ఒత్తిడి, యాంగ్జైటీతో పరీక్షలో తప్పులు జరుగుతాయి. నెగిటివ్ మార్కులు పడతాయి. అందుకే ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఎంత కష్టమైన ప్రశ్నలు వచ్చినా, మొదట మీరు నూరు శాతం కరెక్ట్ అనుకుంటేనే రాయండి. మిగిలినవి పరీక్ష పూర్తి చేసిన తరువాత, రీ చెక్ చేసుకుంటూ ఫోకస్డ్‌గా రాయండి.
ఇటువంటి కొన్ని టిప్స్‌ను విద్యార్థులు ప్రతీ పరీక్షలోనూ అనుసరించాలి. దీంతో, నెగిటివ్ మార్కుల టెన్షన్ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జేఈఈ మెయిన్స్ 2025లో మంచి స్కోరు సాధించే అవకాశాలు పెరుగుతాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- JEE Main 2025
- five tips for jee exam preparation
- jee main exam preparations
- engineering entrance exam
- top 5 tips for jee main exam 2025
- negative marking for jee main 2025
- students entrance exams tips
- top 5 tips for jee main exam students
- engineering and iit entrance exams
- Joint Entrance Exam 2025
- Joint Entrance Exam Main 2025
- Education News
- Sakshi Education News
- JEEMainsPreparation
- NegativeMarkingJEE
- EngineeringEntrance
- JEEMainsTips
- JEEExamStrategy