Inspection Updates: యూనివర్సిటీకి చెల్లించాల్సిన బకాయిలు
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ కళాశాలల అనుబంధ గుర్తింపు తనిఖీలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి తనిఖీలు కొంత పకడ్బందీ గా జరుగనున్నాయని రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఇటీవలే అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ వెంటనే వివిధ కళాశాలలు వర్సిటీకి చెల్లించాల్సిన బకాయిలపై ముందుగా దృష్టి సారించారు. అప్పటికే కళాశాలలు వర్సిటీకి దాదాపు రూ. 30 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తించారు. వెంటనే అనుబంధ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణీత గడువులోగా ఫీజు బకాయిలు చెల్లించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిక చేశారు. దెబ్బకు దిగివచ్చిన కళాశాలల యాజమాన్యాలు (ఒకటి రెండు మినహా) తమ బకాయిలు చెల్లించారు.
School Fees: పాఠశాలల్లో ఫీజుల వివరాలు విద్యాశాఖకు చేరాల్సిందే
అర్హులైన ప్రిన్సిపాళ్లు లేరు..
వర్సిటీ పరిధిలోని పలు అనుబంధ కళాశాలల్లో ఎంత మంది సిబ్బంది వర్సిటీ గుర్తింపునకు లోబడి పని చేస్తున్నారనే విషయంలో స్పష్టత లేదు. చాలా వరకు కళాశాలలకు అర్హత పొందిన ప్రిన్సిపాళ్లు లేరు. దాదాపు పదేళ్లుగా సిబ్బంది రెన్యూవల్స్ లేకపోవడం, కరోనా సమయంలో వర్సిటీ ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించి అనుబంధ గుర్తింపు మంజూరు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు పూర్తిస్థాయి పకడ్బందీ తనిఖీలకు వర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు.
School Attendance Concept: బయోమెట్రిక్ అటెండెన్స్ ఇకపై బడుల్లో కూడా
చర్యలు తప్పవు..
యూజీసీ, యూనివర్సిటీ ని బంధనల మేరకు డిగ్రీ, పీజీ, బీఈడీ కళాశాలల్లో కనీస వసతి సౌకర్యాలు ఉండాలి. వర్సిటీ ఆమోదం పొందిన ప్రిన్సిపాల్, సిబ్బంది లేకపో తే చర్యలు తప్పవు. నిబంధనలు పాటించేందుకు, కనీస సౌకర్యాలు మెరుగుపర్చుకునేందుకు కళాశాలల యాజమాన్యాలకు రెండు నెలల గడువు ఇచ్చాం. సోమవారం నుంచి అనుబంధ గుర్తింపు కోసం కళాశాలలు తనిఖీలు ప్రారంభిస్తాం. అవసరమైతే నిబంధనలు పాటించని కళాశాలల గుర్తింపు రద్దుచేసి వాటిపై చర్యలు తీసుకుంటాం.
– ఘంటా చంద్రశేఖర్, ఆడిట్‌సెల్ డైరెక్టర్, తెయూ
Success Story: ఈ జంట సాధించిన విజయంతో వారి ఇంట వేడుకలు రెట్టింపు...
కళాశాలల నిర్లక్ష్యం..
యూనివర్సిటీ అమోదం పొందిన ప్రిన్సిపాళ్లు లేని అనుబంధ కళాశాలలకు ఈసారి గుర్తింపు ఇస్తారా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ప్రిన్సిపాళ్లు, సిబ్బంది వర్సిటీ ఆమోదం పొందా లని వర్సిటీ ఉన్నతాధికారులు పలుమార్లు కళాశాలల యాజమాన్యాలకు సమచారం ఇచ్చారు. అయితే కొందరు యాజమానులు వర్సిటీ అధికారుల సూచనలు, హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యూజీసీ గైడ్‌లైన్స్ మేరకు 28 నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. యూ జీసీ, యూనివర్సిటీ నిబంధనల మేరకు కనీస వసతులు లేకుండా, ఆమోదం లేని ప్రిన్సిపాల్, సిబ్బంది కొనసాగుతున్న కళాశాలలపై చర్యలు తీసుకునేందుకు ఆడిట్‌సెల్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
Jobs in APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ, నెల్లూరు జోన్‌లో 300 ఉద్యోగాలు .. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
నేటి నుంచి ప్రారంభం
ప్రిన్సిపాళ్లు, సిబ్బంది విషయంలో
గందరగోళం
కనీస సౌకర్యాలు లేని విద్యాసంస్థలపై చర్యలకు సిద్ధం..?