Skip to main content

B. Sc Horticulture: హార్టీక‌ల్చ‌ర్ కోర్సుకు వెబ్ ఆప్ష‌న్స్ న‌మోదు

విశ్వ‌విద్యాల‌యాల అనుబంధ‌, గుర్తింపు క‌ళాశాల‌ల్లో హార్టీక‌ల్చ‌ర్ కోర్సుకు వెబ్ ఆప్ష‌న్స్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. అనంత‌రం ప్ర‌క‌టించిన తేదీ అనుసారం కౌన్సెలింగ్ కోసం హాజ‌రు కావాల‌ని తెలిపారు. కళాశాల‌లో చెల్లించాల్సిన ఫీజు వివ‌రాల‌ను కూడా స్ప‌ష్టించారు.
Students applying web options for Horticulture course
Students applying web options for Horticulture course

సాక్షి ఎడ్యుకేష‌న్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లో బీఎస్సీ (హానర్సు) హార్టీకల్చర్‌ కోర్సుకు సంబంధించి మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 12, 13, 14 తేదీల్లో రెండోదశ వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవచ్చని వర్సిటీ రిజి­స్ట్రార్‌ బి.శ్రీనివాసులు బుధవారం తెలిపారు.

YVU Degree Honors: డిగ్రీ హాన‌ర్స్ ను ప్రారంభించ‌నున్న వైవీ యూనివ‌ర్సిటీ

మొదటి కౌన్సెలింగ్‌ ద్వారా కాలేజీల్లో చేరిన విద్యార్థులు, ఈ కోర్సు కోసం దరఖాస్తు ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకున్న మిగిలిన విద్యార్థులు అందరూ వెబ్‌ ఆప్షన్స్‌కు అర్హులు అని పేర్కొన్నారు. హార్టీసెట్‌–2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 21న డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు.

Bond Between Colleges: ప‌ర‌స్ప‌ర స‌హ‌కార ఒప్పందం

ప్రభుత్వ కళాశాలల్లో ఫీజుల వివరాలు
సెమిస్టర్‌ ఫీజు జనరల్‌ సీటు రూ.51,083 
పేమెంట్‌ సీటు రూ.1,38,488  
ఫీజులు, ఇతర వివరాల కోసం... 
ప్రభుత్వ ఉద్యాన కళాశాల 
వెంకట్రామన్న­­గూడెం, 7382633648
అనంతరాజుపేట –7382633651
పార్వతీపురం–7382633660 
చినలాటరపి–7382633443 నంబర్లలో సంప్రదించవచ్చు.

Govt Junior College: విద్యార్థులు కష్టపడి చదివితే ఉత్తమ భవిష్యత్‌

వర్సిటీ గుర్తింపు కళాశాలల్లో ఫీజులు 
ఎన్‌ కాలేజ్‌ ఆఫ్‌ హార్టీ సైన్సెస్, మార్కాపురం రూ.44,000
శ్రీకృష్ణదేవరాయ కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ సైన్సెస్, అనంతపురం రూ.77,000
జేసీ  దివాకరరెడ్డి హార్టికల్చర్‌ కాలేజ్, తాడిపత్రి రూ.65,000
కేబీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌  హార్టికల్చర్‌ సీఎస్‌.పురం రూ.38,700   

Published date : 12 Oct 2023 05:24PM

Photo Stories