Govt Junior College: విద్యార్థులు కష్టపడి చదివితే ఉత్తమ భవిష్యత్
హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్టోబర్ 11న బుధవారం నిర్వహించిన ఫ్రెషర్స్ డేలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు తమకిష్టమైన రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. ఆర్థిక, రాజకీయపరమైన అంశాలపై అవగాహ న ఉండాలని, పెద్దలపై గౌరవం కలిగి లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. తల్లిదండ్రులు, విద్యనేర్పిన గురువులను మరువకూడదన్నారు. డీఐఈఓ గోపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్ కీలక దశ అన్నారు. చదువుపై దృష్టి సారిస్తూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్నేహభావంతో మెలగాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ధర్మేంద్ర మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా తమ కళాశాలలో ఇంటర్‌తో పాటు ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నామని తెలి పారు. అనంతరం చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులు, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసపత్రాలను అందజేశారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ అధ్యాపకులు మాధవి, విజయనిర్మల టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
చదవండి: Model Schools: టీజీటీలకు పీజీటీలుగా ఉద్యోగోన్నతులు.. సర్టిఫికెట్ల పరిశీలన