Bond Between Colleges: పరస్పర సహకార ఒప్పందం

సాక్షి ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయం, పోరుమామిళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధ్య విద్య, పరిశోధన కార్యకలాపాలకు సంబంధించిన పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదిరింది. వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి, భౌతికశాస్త్ర విభాగాధిపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి, పోరుమామిళ్ల భౌతికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వెంకట్రావు ఒప్పంద పత్రాలపై బుధవారం సంతకాలు చేశారు. కార్యక్రమంలో భౌతికశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ వి. వెంకట్రాము, డాక్టర్ రాఘవేందర్ పాల్గొన్నారు.
Semester Results: ఎం.ప్లాన్ సెమిస్టర్ ఫలితాలు విడుదల
వైవీయూకు విద్యాశాఖ మంత్రి అభినందన
యోగివేమన విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ గ్రేడ్ లభించడం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించారు. మంగళవారం విజయవాడలో ఏపీ ఉన్నతవిద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో వైవీయూ వీసీ ఆచార్య చింతా సుధాకర్, ఐక్యూఏసీ సంచాలకులు డాక్టర్ లోకా సుబ్రమణ్యశర్మలను సత్కరించి జ్ఞాపిక అందజేశారు.