Skip to main content

Semester Results: ఎం.ప్లాన్ సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

ఎం.ప్లాన్ విభాగంలో 4వ సెమిస్ట‌ర్ ఫ‌లితాల‌ను విశ్వ‌విద్యాల‌యం వైస్ చాన్స‌ల‌ర్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల‌ను అభినందించారు.
Vice Chancellor of AFU releasing the semester results
Vice Chancellor of AFU releasing the semester results

సాక్షి ఎడ్య‌కేష‌న్: కడప నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయంలో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌లోని ఎం.ప్లాన్‌ (యూఆర్‌పీ) విభాగానికి సంబంధించిన 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం విశ్వవిద్యాలయంలో వైస్‌ చాన్సలర్‌ ఆచార్య బి. ఆంజనేయప్రసాద్‌ ఫలితాలను స్క్రీన్‌పై విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పరీక్షా ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత రావడం అభినందనీయమన్నారు.

Skill Training: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్ లో శిక్ష‌ణకు ద‌ర‌ఖాస్తులు

పరీక్షా ఫలితాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌ రాజేష్‌కుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ వై. పవన్‌కుమార్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఇ.సి. సుప్రియ, ఉదయప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.

Published date : 12 Oct 2023 04:44PM

Photo Stories