Muslim University: అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
Sakshi Education
నైమా ఖాతూన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కి తొలి మహిళా వైస్ చాన్స్‌లర్‌గా నియమితురాలయ్యారు.
ఆమె నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ఎన్నికల కమిషన్ అనుమతి కూడా తీసుకున్నట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఖాతూన్ ఏఎంయూలో సైకాలజీలో పీహెచ్‌డీ పొందారు, 5 సంవత్సరాలపాటు వర్సిటీ వీసీగా కొనసాగనున్నారు. 1875లో స్థాపించబడిన ముహమ్మదన్ ఆంగ్లో ఓరియెంటల్ కాలేజీ 1920లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది.
నైమా ఖాతూన్ ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాకు చెందినవారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో ఎంఏ చేశారు. ఆమె ఏఎంయూలో 1990లో చేరారు మరియు 2021లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. ఆమె విద్యార్థి సంక్షేమం, లైంగిక వేధింపుల నివారణ వంటి అంశాలపై చురుకుగా పనిచేశారు.
Published date : 24 Apr 2024 10:29AM