Skip to main content

Practical's for Students : విద్యార్థుల‌కు ప్ర‌యోగాలు త‌ప్ప‌నిస‌రి.. ఇంట‌ర్ బోర్డు ఆదేశం!

పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాలు విద్యార్థులకు వందశాతం అర్థం చేసుకోవాలంటే ప్రయోగాలు తప్పనిసరి. అందుకు అనుగుణంగా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే వాటిని విద్యార్థుల చేత చేయించాలి.
Inter board announces practicals for students for better understanding

కడప: అయితే ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు ప్రయోగాలను అటకెక్కిస్తున్నాయి. ప్రాక్టికల్స్‌ను కిల్‌ చేస్తూ ఆ పీరియడ్లను థియరీకి వినియోగిస్తున్నాయి. ప్రాక్టికల్స్‌కు సంబంధించి ద్వితీయ సంవత్సరం చివరిలో అది కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు మరో 20 రోజులుండగా వాటికి బూజులు దులిపి విద్యార్థుల చేత అరకొరగా ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తారు. తనిఖీలు చేయాల్సిన అధికారులు చోద్యం చేస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల్లో ప్రాక్టికల్‌ ప్రమాణాలు పడిపోతున్నాయి.

UIIC Recruitment 2024: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్-I ... 200 ఖాళీలు... పరీక్షా విధానం ఇదే!

అన్ని యాజమాన్య కళాశాలల్లో..

జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య జూనియర్‌ కళాశాలల్లో ఫస్ట్‌ ఇయర్‌ అకడమిక్‌ ప్రారంభం నుంచే థియరీకి సమాంతరంగా ప్రాక్టికల్స్‌ తరగతులను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రకారం ఎక్కడ కూడా జరగడం లేదు. ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తే థియరీ బోధనకు సమయం సరిపోదని అంతగా ప్రాక్టికల్స్‌ గురించి పట్టించుకోరు. ద్వితీయ సంవత్సరం నుంచి ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో మాత్రం విద్యార్థులకు పీరియడ్లను కేటాయించి ప్రాక్టికల్స్‌ తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులతో ప్రయోగాలను చేయిస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ప్రైవేటు, కార్పొరేట్‌లలో నిల్‌..

జిల్లా వ్యాప్తగా అత్యధిక ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రాక్టికల్‌ క్లాసుల నిర్వహణ అనేది పూర్తిగా జరగడం లేదనేది జగమెరిగిన సత్యం. ప్రాక్టికల్స్‌ పరీక్షలకు సంబంధించి కెమిస్ట్రి, ఫిజికల్‌ సైన్సు, బాటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో దానికి 30 మార్కులు ఉండటంతో వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో మార్కుల స్కోర్‌ పెరగడానికి ప్రాక్టికల్స్‌ మార్కులు బాగా దోహదపడతాయి. ఇందుకోసమే ప్రాక్టికల్‌ పరీక్షల విధులకు వచ్చే సిబ్బందిని ప్రసన్నం చేసుకుని చదువులో బాగా రాణించే విద్యార్థులకు మంచి మార్కులు వేయించుకుని స్కోర్‌ను పెంచుకుంటారు.

World Wide Fund: ప్రపంచంలో అత్యుత్తమ ఆహారం.. భారతదేశానిదే..

నిబంధనలకు పాతర..

జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు ఇంటర్‌ బోర్డు నిబంధనలకు పాతరేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అడ్డదారుల్లో మార్కులు, ర్యాంకులు తెచ్చుకునే వెసులుబాటుకు అలవాటు పడిన యాజమాన్యాలు ప్రాక్టికల్స్‌ పీరియడ్స్‌ను పక్కన పెట్టేశాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాక్టికల్స్‌ పరీక్షల సమయంలో ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ. 500 నుంచి రూ. వెయ్యి వరకు వసూలు చేసి ఈ సొమ్మును ప్రాక్టికల్స్‌ పరీక్షల నిర్వహణకు వచ్చే సిబ్బందికి ముడుపులుగా ఇస్తారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

జంబ్లింగ్‌ ఎత్తేసినప్పటి నుంచి...

గతంలో కొన్ని రోజులు ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణను జంబ్లింగ్‌ విధానంలో చేపట్టేవారు. అంటే ఒక కళాశాలకు చెందిన విద్యార్థులు మరో కళాశాలకు వెళ్లి ప్రాక్టికల్‌ చేయాల్సి వచ్చేది. దీంతో కళాశాలల యాజమాన్యాలు కొంత భయపడి విద్యార్థుల చేత ప్రాక్టికల్స్‌ చేయించేవారు. ఆ తరువాత మళ్లీ జంబ్లింగ్‌ విధానాన్ని ఎత్తేస్తూ ఇంటర్‌బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మళ్లీ ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది.

Published date : 15 Oct 2024 10:21AM

Photo Stories