Skip to main content

Government Men's Degree College: ఆర్ట్స్‌ కాలేజీలో ఘనంగా వార్షిక వేడుకలు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో విశిష్టమైన గుర్తింపు పొందిన శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్‌) కళాశాలలో మంగళవారం కళాశాల వార్షిక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
కళాశాల వార్షిక వేడుకల్లో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సురేఖ
కళాశాల వార్షిక వేడుకల్లో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సురేఖ

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.సురేఖ మాట్లాడుతూ ఎంతో ఖ్యాతి గడించిన ఈ కళాశాలలో పనిచేస్తున్నందుకు తనతోపాటు అధ్యాపకులకు అందరికీ గర్వకారణమన్నారు. కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రోణంకి హరిత వార్షిక నివేదికను వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కోశాధికారి బరాటం శ్రీరా ములు, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎంవీ సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

Published date : 06 Sep 2023 05:53PM

Photo Stories