ఏయూలో ఏర్పాట్ల పరిశీలన
Sakshi Education
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను ఆదివారం వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి పరిశీలించారు.
వర్సిటీలో ఐదు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. అనంతరం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో విద్యార్థులతో ముఖాముఖి ఉంటుంది. వర్సిటీలో ఈ మూడేళ్ల కాలంలో 18 నూతన ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. వీటిని కలెక్టర్ మల్లికార్జున పరిశీలించి ఐదు ప్రాజెక్టులకు ఈ పర్యటనలో భాగంగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఏయూ అధికారులను సూచించారు. ఈ మేరకు టెక్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్(ఆ–హబ్), ఫార్మా ఇంక్యుబేషన్(ఎలిమెంట్), ఏయూ డిజిటల్ జోన్, స్మార్ట్ క్లాస్‌రూం కాంప్లెక్స్(అల్గారిథమ్), ఏయూ స్యూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఏయూ సిబ్), ఏయూ అవంతి ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ స్కిల్ హబ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఏర్పాట్లను వీసీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Published date : 31 Jul 2023 03:19PM