Skip to main content

Dussehra Holidays 2023 : కాలేజీలకు దసరా పండ‌గ‌ సెలవులు 7 రోజులు మాత్ర‌మే.. ఇక స్కూల్స్ భారీగానే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : పాఠ‌శాల‌, కాలేజీ విద్యార్థుల‌కు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు అక్టోబర్ పండ‌గ నెల‌గా చెప్ప‌వ‌చ్చును. ఇక తెలంగాణలో అయితే బతుకమ్మ, దసరా పండగ అత్యంత వైభవంగా జ‌రుగుతాయి.
School and College Students,,Colleges Holidays News in Telugu, Bathukamma Festival,Dussehra Celebration
Colleges Holidays News

అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే సెలవులు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని స్కూల్స్‌కు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. 

అక్టోబ‌ర్ 13వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ మేర‌కు రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. అలాగే తెలంగాణ‌లోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని వెల్లడించింది. తెలంగాణలో దసరా సెలవులు గతేడాది 14 రోజులు ఉండగా.. ఈసారి మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ప్రకటించారు. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తిరిగి తెరుచుకోనున్నాయి.

తెలంగాణ ప్రజలు అక్టోబర్ 23వ తేదీన దసరా పండగ జరుపుకోనున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవు తేదీలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవును అక్టోబరు 23కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అక్టోబరు 24వ తేదీని కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం విజయ దశమి సెలవును మార్చింది. ఇంతకు ముందు ప్రకటించిన సెలవును సైతం కొనసాగింది. ఈ ఏడాదికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో అక్టోబరు 24వ తేదీన దసరా సెలవు దినంగా పేర్కొంది. తాజాగా ఆ సెలవును ఒక రోజు ముందుకు తీసుకొచ్చింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం..

holidays news 2023 telugu news

ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబ‌ర్ 14వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొంది.

Published date : 09 Oct 2023 07:43AM

Photo Stories