Semester Instant Exams: September 21 నుంచి డిగ్రీ పరీక్షలు
Sakshi Education
తిరుపతి సిటీ : శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ కోర్సులకు సంబంధించి ఐదు, ఆరవ సెమిస్టర్ ఇన్‌స్టంట్ పరీక్షలను ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి దామ్లానాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Degree Exams
ఇప్పటికే పరీక్షల ఫీజు చెల్లించిన విద్యార్థులకు పరీక్షల షెడ్యూలు విడదల చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్వీయూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలకు సర్క్యులర్ పంపించామని వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి బీటీ కళాశాల, చిత్తూరు పీవీకేఎన్ కళాశాల, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సెంటర్లలో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అలాగే ఈ నెల 11వ తేదీన జరగవలసిన పీజీ నాలుగో సెమిస్టర్, ఎంఈడీ పరీక్షలను ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్టు తెలిపారు.