ITI Counselling: ఐదో విడత కౌన్సెలింగ్ కు దరఖాస్తులు
సాక్షి ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో మిగులు సీట్ల భర్తీకి ఐదో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కన్వీనర్, ఐటీఐ ప్రిన్సిపాల్ డి.శ్రీనివాసాచారి తెలిపారు. విద్యార్థులు ఏ ఐటీఐలో ప్రవేశం పొందాలనుకుంటున్నారో ఆ ఐటీఐకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ నెల 7వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Admissions in JNTUH: జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు.. కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలు
8న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులు ఈనెల 9న ప్రభుత్వ ఐటీఐలలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాలకు ట్రైనింగ్ ఆఫీసర్లు టి.చక్రపాణి, డి.చంద్రశేఖర్‌లను 9491813637, 7013737243 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.