Skip to main content

AP Inter Colleges Summer Holidays 2024 Announced : ఏపీ ఇంటర్ కాలేజీలకు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం..మొత్తం ఎన్నిరోజుంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇంట‌ర్ కాలేజీల‌కు భారీగా వేస‌వి కాలేజీలను ప్ర‌క‌టించారు. అన్ని ప్ర‌భుత్వ, ప్రైవేట్ ఇంట‌ర్ కాలేజీల‌కు మే 31వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ఇచ్చారు. తిరిగి కాలేజీలు అన్ని జూన్ 1వ తేదీన నుంచి పున:ప్రారంభం అవుతాయని ఇంట‌ర్ బోర్డ్‌ వెల్లడించింది.
AP Inter Colleges Summer Holidays 2024 Details

ఇప్ప‌టికే ప్రైవేట్ ఇంట‌ర్‌ కాలేజీలు ప్ర‌వేశాలు నిర్వ‌హింస్తున్నారు. ఇంకా ఇంట‌ర్ ప్ర‌వేశ‌ షెడ్యూల్ విడుదల కాకపోయినా ప్రవేశాలు నిర్వహిస్తున్న కాలేజీలపై క‌ఠిన చర్యలు తీసుకుంటామని ఇంట‌ర్  బోర్డ్‌ హెచ్చరించింది.

చ‌ద‌వండి: After‌ Inter MPC‌: ఇంజనీరింగ్‌తోపాటు వినూత్న కోర్సుల్లో చేరే అవకాశం.. అవకాశాలు, ఎంట్రన్స్‌ టెస్టుల వివ‌రాలు ఇలా..

ఒక‌వేళ ఈ వేస‌వి సెల‌వుల్లో.. ప్రైవేట్ ఇంట‌ర్ కాలేజీలు త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తే.. వీరిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇంట‌ర్ బోర్డ్ తెలిపింది. అలాగే ఏప్రిల్ 4వ తేదీతో ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల మూల్యాంకనం పూర్తి చేశారు. ఈ సారి ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రంకు మొత్తం 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంట‌ర్ మొద‌టి రెండో సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఏప్రిల్ 12వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

తెలంగాణ‌లో కూడా ఇంట‌ర్ కాలేజీల‌కు..
తెలంగాణలోని ఇంట‌ర్‌ కాలేజీలకు ప్రభుత్వం వేసవి సెలవులు ఇంటర్‌ బోర్డు సెలవులు ప్రకటించింది. మార్చి 31వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి. ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను ఏప్రిల్ మూడో వారంలో విడుద‌ల చేయ‌నున్నారు.

అలాగే ఇంటర్ బోర్డు ప్రకటన తర్వాత కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోవాలని కూడా ఇంటర్‌ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంట‌ర్ అకడమిక్ యాన్యువల్ క్యాలెండర్‌ను మార్చి 30వ తేదీన‌ విడుదల చేసింది.

చ‌ద‌వండి: Inter Special: ఎంపీసీ.. అకడమిక్‌ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్‌!!

ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇంట‌ర్‌ విద్యా సంవత్సరం 2024 జూన్ 1వ తేదీ ప్రారంభమై.. 2025 మార్చి 29వ‌ ముగియనుంది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం పని దినాలు 227గా ఉండనున్నాయని ప్రకటించారు. అలాగే వ‌చ్చే ఏడాది కూడా కాలేజీల‌కు సెల‌వులు భారీగానే ఉన్నాయి. ఇంట‌ర్ అర్ధవార్షిక పరీక్షలు నవంబర్ 18 నుంచి 23 వరకు నిర్వ‌హించ‌నున్నారు. అలాగే ఇంట‌ర్‌ ప్రీ ఫైనల్ పరీక్షలు 2025 జనవరి 20 నుంచి 25 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఇంట‌ర్‌ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వ‌హించ‌నున్నారు. ఇంట‌ర్‌ పబ్లిక్ పరీక్షలు మాత్రం మార్చి మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.

ఇంట‌ర్ విద్యార్థుల‌కు సెల‌వులు- ప‌రీక్ష‌లు 2024-25..
ఇంట‌ర్ విద్యార్థుల‌కు దసరా సెలవులు అక్టోబర్ 6 నుంచి 13 వరకు ఉండనున్నాయి. అలాగే సంక్రాంతి సెలవులు 2024 జనవరి 11 నుంచి 16 వరకు ఉండనున్నాయి. అలాగే వివిధ పండ‌గ సెల‌వులు తేదీల‌ను బ‌ట్టి ఇవ్వ‌నున్నారు. అలాగే 2025 వేస‌వి సెల‌వులు మాత్రం మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

Published date : 04 Apr 2024 05:42PM

Photo Stories