Skip to main content

4-year degree courses: నాలుగేళ్ల డిగ్రీ కోర్సు 'ఐటెప్‌'కు దరఖాస్తుల ఆహ్వానం

4-year degree courses

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రొగ్రాం (ఐటీఈపీ)కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 13వ తేదీలోపు విద్యార్థులు వర్సిటీ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.బీఆర్‌ఏయూ.ఈడీయు.ఐఎన్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

Anganwadi Jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

ఈ నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో బీఏబీఈడీలో 50 సీట్లు, బీఎస్సీ బీఈడీలో 50 సీట్లు ఉన్నాయి. ఇంటర్మీడియెట్‌ తర్వాత నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన ఎస్‌సీపీటీ –2024 పరీక్షలో స్కోర్‌ సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు నిర్వహిస్తారు. గత ఏడాది ఈ కోర్సును ప్రారంభించారు. నాలుగేళ్ల డిగ్రీతో పాటు బీఎడ్‌ అర్హత లభిస్తుంది.

Meesho Hires 8.5 Lakh Jobs: నిరుద్యోగులకు బంపర్‌ఆఫర్‌.. ఇదే కరెక్ట్‌ టైం, లక్షల్లో ఉద్యోగాల భర్తీ

మూడేళ్ల తరువాత డిగ్రీతో సైతం విద్యార్థులు రిలీవ్‌ కావచ్చు. ఈ డిగ్రీ చదివిన విద్యార్థులు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల మేరకు స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్‌జీటీ రెండు ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్‌ రోస్టర్‌ మేరకు ప్రవేశాలు నిర్వహిస్తారు.
 

Published date : 06 Sep 2024 12:53PM

Photo Stories