Skip to main content

Yogi Vemana university Distance Education: వైవీయూలో దూరవిద్య కోర్సులు ప్రారంభం... ఎప్పుడంటే

వైఎస్సార్ జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయం సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. తాజాగా ‘దూర విద్య’ను ప్రారంభించనుండటంతో జిల్లా వాసులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు సైతం డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా తాము కోరుకున్న విద్యను పొందే అవకాశం లభించింది.
Yogi-Vemana-university
Yogi Vemana university

గతేడాది వైవీయూకు న్యాక్‌ ఏ గ్రేడ్‌ లభించడంతో డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రారంభించేందుకు అనుమతి లభించినట్లయింది. దీంతో డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేశారు. కాగా వైవీయూ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ తొలి డైరెక్టర్‌ ఆచార్య ఏజీ దాము, రెండో డైరెక్టర్‌గా ఆచార్య పి.ఎస్‌. షావల్లీఖాన్‌, ప్రస్తుత డైరెక్టర్‌ ఆచార్య కె. కృష్ణారెడ్డి, సహాయ సంచాలకులు డా. ఆర్‌.శ్రీధర్‌బాబు కృషిచేయడం, విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య చింతా సుధాకర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్యలు సంపూర్ణ సహకారం అందించడంతో త్వరితగతిన డెబ్‌ అనుమతులు లభించాయి. ఈ ఏడాది జూన్‌ 26, 27 తేదీల్లో వర్చువల్‌ విధానంలో నిపుణుల కమిటీ పరిశీలించి 15 కోర్సులకు సిఫార్సు చేసింది. విద్యార్ధులు, గృహిణులు, ప్ర‌భుత్వ‌, ప్ర‌వేటు ఉద్యోగుల‌కు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌తో పాటు ప‌దోన్న‌తులు పొందే అవ‌కాశం ఉన్న కోర్సులు ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. 2023–24 విద్యాసంవత్సరం నుంచి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ను వైవీయూ అధికారులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో రెగ్యులర్‌ విధానంతో పాటు దూరవిద్యను సైతం విశ్వవిద్యాలయం సమాంతరంగా నిర్వహించనుంది.

 Navodaya Admissions: నవోదయ దరఖాస్తులకు 10వ తేదీ గడువు

కోర్సుల వివరాలు..

యూజీ కోర్సులు: బీఏ జనరల్‌, బీఏ (హిస్టరీ, ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌), బీఏ (ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌), బీకాం, బీఏ (హిస్టరీ, పొలిటికల్‌సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌), బీఏ (హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, స్పెషల్‌ తెలుగు).

పీజీ కోర్సులు: ఎంఏ (హిస్టరీ), ఎంఏ (తెలుగు), ఎంఏ (ఎకనామిక్స్‌), ఎంఏ (ఇంగ్లీషు), ఎంఏ (జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌), ఎంకాం, ఎంఏ (సైకాలజీ), ఎంఏ (పొలిటికల్‌ సైన్స్‌). ఎంఏ (మ్యాథమ్యాటిక్స్‌).

☛☛ Top 5 highest salaries Paying countries : ప్రపంచంలో ఎక్కువ జీతం ఇచ్చే టాప్ 5 దేశాలు ఏంటో తెలుసా!

Published date : 08 Aug 2023 12:59PM

Photo Stories