Skip to main content

Admissions: ITI కళాశాలల్లో మూడో విడత ప్రవేశాలు

గుడివాడటౌన్‌: కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలల్లో మూడో విడత ప్రవేశానికి ప్రభుత్వం అనుమతించిందని కేబీఆర్‌ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.హరిధర్మేంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ITI College
ITI College

ఈ నెల 27వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విధానం ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే కళాశాలలో ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌చే వెరిఫై చేయించి వారి ద్వారానే ఆన్‌లైన్‌ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐ కౌన్సెలింగ్‌ ఈనెల 30, ప్రైవేట్‌ ఐటీఐ కౌన్సెలింగ్‌ ఈనెల 31న జరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు ఏ విధమైన కాల్‌ లెటర్స్‌ పంపబడవని, వారే స్వయంగా సమాచారం తెలుసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 08674 295953, 99085 18799 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Also read: APPSC Group-1.. తొలి ప్రయత్నంలోనే కొట్టానిలా..| APPSC Group 1 Ranker Pavani Success Story | DSP Job

Published date : 22 Aug 2023 05:34PM

Photo Stories