Exams Postponed : నేడు నిర్వహించాల్సిన ఈ పరీక్షలు వాయిదా.. కారణం!
Sakshi Education
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 4వ తేదీన జరగాల్సిన పీజీ 4వ సెమిస్టర్, డిగ్రీ 7వ సెమిస్టర్, ఇంజనీరింగ్, ఎంసీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు యోగివేమన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్‌నకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. వాయిదా పడిన పరీక్షను ఆయా పరీక్షల చివరి పరీక్ష తర్వాత నిర్వహిస్తామని తదనగుణంగా సూచనలను ఆయా కళాశాలలకు పంపించామని పేర్కొన్నారు.
School Admissions: 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
Published date : 05 Jul 2024 10:08AM