Science Fusion Fiesta 2023: సైన్స్‌ఫేయిర్ మేనియా
Sakshi Education
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని మానస ఎక్స్‌లెన్స్ స్కూల్‌లో విద్యార్థులు సైన్స్ ఫ్యూజన్ ఫిస్టా డిసెంబర్ 2023 పేరుతో సైన్స్‌ఫేర్ మేనియా నిర్వహించారు.
![Science fair Mania](/sites/default/files/images/2023/12/14/13jgl80-180032mr0-1702546641.jpg)
మండల విద్యాధికారి గాయత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకత పెరగాలంటే ఇవి ఎంతో అవసరమని, జీవితంలో విజ్ఞానశాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు.
చదవండి: School Education Department: సైన్స్ ఎగ్జిబిషన్, ఇన్‌స్పైర్‌కు ఏర్పాట్లు
విద్యార్థులు సూక్ష్మ నీటిపారుదల, మానవ పరిణామం, ఆయుర్వేద ప్రాముఖ్యత, సూర్యచంద్ర గ్రహాల అపోహలు లాంటివి ఎన్నో ప్రదర్శించారు. ఇవి ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రజితరావు, శ్రీధర్‌రావు, హరిచరణ్‌రావు పాల్గొన్నారు.
Published date : 14 Dec 2023 03:07PM