Andhra Pradesh: వైద్య విధాన పరిషత్‌లో పలు కేడర్లలో మార్పులు
ఈ నేపథ్యంలో పలు పోస్టుల కేడర్‌ను మారుస్తూ ఇటీవల కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 13న వైద్య శాఖ సవరించిన ఉత్తర్వులను విడుదల చేసింది.
Also read: Medical posts: దసరా కానుకగా వైద్య పోస్టులు భర్తీ చేస్తామన్న హరీశ్
ఈ మేరకు 91 డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టుల కేడర్‌ను సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేశారు. మరో 169 డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులను (168 సీఏఎస్ స్పెషలిస్ట్, ఒక సీఏఎస్ జనరల్) సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కేడర్‌కు తగ్గించారు. మరో 11 సీఎస్–ఆర్‌ఎంవోలు, 42 సీఎస్–డెంటల్ పోస్టులను సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులుగా మార్చారు. 25 సీనియర్ అసిస్టెంట్ పోస్టులను ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేశారు.
Also read: Quiz of The Day (September 14, 2022): కుల వ్యవస్థ ఎప్పుడు ఉద్భవించింది?